iQoo 12 5G With Snapdragon 8 Gen 3 SoC India Launch
iQoo 12 5G Series : ఐక్యూ 12 సిరీస్ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని ధృవీకరించింది. ఇదే లైనప్‌లో బేస్ iQoo 12, iQoo 12 Pro మోడల్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు, కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాసెసర్, బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో సహా కొన్ని కీలక వివరాలను ధృవీకరించింది. ఈ (iQoo 12 5G Series) ఫోన్ కెమెరా వివరాలను కూడా టీజ్ చేసింది.
ఇతర స్పెసిఫికేషన్‌లు గతంలో లీక్ అయ్యాయి. కానీ, ఇప్పుడు, iQoo 12 5G భారత్ లాంచ్ తేదీ కూడా రివీల్ చేసింది. ముఖ్యంగా, ఐక్యూ 12 భారత్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా పవర్ ఇచ్చే మొదటి ఫోన్. లీక్‌ల ప్రకారం.. ఐక్యూ 12 ప్రో కూడా వర్కింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ ప్రో వెర్షన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే పరిస్థితి లేదు.
ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మార్యా (X) వేదికగా ఐక్యూ 12 5G ఫోన్ డిసెంబర్ 12న దేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరించారు. డిసెంబర్ 2022లో ఆవిష్కరించిన ఐక్యూ 11 తర్వాత బేస్ ఐక్యూ 12 మోడల్ వస్తోంది. రాబోయే ఐక్యూ 12 సిరీస్ ప్రో మోడల్ గురించి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. క్వాల్‌కామ్న్ (Qualcommm) లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 SoC ద్వారా అందిస్తుందని ధృవీకరించింది.
Read Also : iQoo 12 Series Launch : నవంబర్ 7న ఐక్యూ 12 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
ఐక్యూ 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14తో వస్తుందని భావిస్తున్నారు. 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల (BOE OLED) ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశం స్థాయి 3,000 నిట్‌లు, పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ రేట్ 2,160Hz ఉండనున్నాయి.
iQoo 12 5G Series India Launch
ఐక్యూ 12 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ ఓమ్నివిజన్ OV50H సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడిన మరో 50MP సెన్సార్, 64MP ఉన్నాయి. 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ సపోర్టుతో OV64B టెలిఫోటో షూటర్, ఫ్రంట్ కెమెరా 16MP సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు.
Ending 2023 with a BANG! #iQOO12 is coming on 12.12.23. #DoTheDream #iQOO pic.twitter.com/FV2TPiFhMk
— Nipun Marya (@nipunmarya) November 1, 2023
ఐక్యూ 12 5G ఫోన్ డెస్ట్, స్ప్లాష్ నిరోధకతకు IP64 రేటింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. బ్లూటూత్ 5.4, NFC, Wi-Fi 7 కనెక్టివిటీ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,880mAh బ్యాటరీని అందించవచ్చు.
ఐక్యూ 12 5G స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : ఐక్యూ 12 ఫోన్ 6.78-అంగుళాల 1.5K BOE OLED డిస్‌ప్లేను 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుంది.
చిప్‌సెట్ : ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉండనుంది.
ర్యామ్ – స్టోరేజ్ : ఈ ఫోన్ గరిష్టంగా 16GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
OS : ఆరిజిన్ OS4.0తో ఆండ్రాయిడ్ 14 బాక్స్ ఉండవచ్చు.
కెమెరాలు : ఐక్యూ 12 5G ఫోన్ OISతో 50ఎంపీ ఓమ్నివిజన్ OV50H ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ శాంసంగ్ JN1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపీ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండనుంది.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ : ఈ డివైజ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉండాలి.
ఐక్యూ 12 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 చిప్‌సెట్, 16GB ర్యామ్, ఆండ్రాయిడ్ 14 OSతో గీక్‌బెంచ్‌లో గుర్తించారు. ఐక్యూ 11 ప్రో భారత్‌లో రాలేదు. ఈ బ్రాండ్ ఐక్యూ 12 ప్రోని కూడా లాంచ్ చేసే అవకాశం
లేదు. ఈ మోడల్ చైనాకు ప్రత్యేకంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : iQOO 12 Photos Leak : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ 12 ఫోన్ వచ్చేస్తోంది.. నవంబర్ 7నే లాంచ్..!