iQOO 15 Sale : కొత్త ఐక్యూ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో ఐక్యూ 15 ధర భారీగా తగ్గింది. నవంబర్ 26న లాంచ్ అయిన ఈ ఐక్యూ 15 ఫోన్ అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే స్పెసిఫికేషన్లతో వస్తుంది.
2/7
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్ కలిగి ఉంది. 6.85-అంగుళాల శాంసంగ్ M14 అమోల్డ్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే వస్తుంది. 7,000mAh బ్యాటరీ, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. కొనుగోలుదారులు ఐక్యూ 15 కొనుగోలుపై భారీగా ఆదా చేసుకోవచ్చు.
3/7
ఐక్యూ 15 కాన్ఫిగరేషన్ 12GB + 256GB స్టోరేజీ అసలు ధర రూ. 72,999 ఉండగా బ్యాంకు డిస్కౌంట్ ద్వారా కేవలం రూ. 64,999కే లభిస్తోంది. 16GB + 512GB స్టోరేజీ అసలు ధర రూ. 79,999 నుంచి రూ. బ్యాంకు డిస్కౌంట్ ద్వారా రూ. 71,999 తగ్గింపుతో లభిస్తోంది.
4/7
ఈ హ్యాండ్‌సెట్ ఆల్ఫా (బ్లాక్) లెజెండ్ (వైట్) అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో డిసెంబర్ 1, మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐక్యూ ఇ-స్టోర్, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా ఐక్యూ 15 కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
5/7
ఐక్యూ 15 సేల్ ఆఫర్లు : ఐక్యూ 15 సేల్ ప్రారంభ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు భారీ సేవింగ్స్ ద్వారా పొందవచ్చు. ఐక్యూ 15 కొనుగోలు చేసే కొనుగోలుదారులు Axis, HDFC ICICI బ్యాంక్ కార్డులతో రూ. 7వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
6/7
ఈ డిస్కౌంట్ ప్రారంభ ధర రూ. 64,999కి తగ్గిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు అదే మొత్తానికి (రూ. 7వేల వరకు) విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ఫైనల్ ధర పాత స్మార్ట్‌ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
7/7
అయితే, ఈ ఆఫర్ ఫోన్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఐక్యూ అర్హత కలిగిన కస్టమర్ల కోసం రూ. 1,000 విలువైన అదనపు డిస్కౌంట్ కూపన్‌ను కూడా అందిస్తోంది. మొత్తం ధరను ముందస్తుగా చెల్లించకపోతే 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.