iQOO Z11xa Sale : సూపర్ గేమింగ్ ఫోన్.. ఇలా కొన్నారంటే ఈ ఐక్యూ Z11xa అతి చౌకైన ధరకే..
iQOO Z11xa Sale : భారత మార్కెట్లో ఐక్యూ Z11xa సేల్ ప్రారంభమైంది. ఈ ఐక్యూ గేమింగ్ ఫోన్‌తో వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై అనేక డిస్కౌంట్లను పొందవచ్చు.. పూర్తి ఆఫర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- September 14, 2026 / 04:35 PM IST
iQOO Z11xa Sale
- ఐక్యూ జెడ్11xa ఫస్ట్ సేల్ మొదలైంది
- ఈ ఐక్యూ ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్
- పవర్‌ఫుల్ 7200mAh బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్ ఫీచర్లు
- ఈ ఫోన్ ఫస్ట్ సేల్‌లో బ్యాంకు డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు
iQOO Z11xa Sale : కొత్త గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ నుంచి అత్యంత సరసమైన ధరకే కొత్త గేమింగ్ ఫోన్ వచ్చేసింది. గత వారమే ఐక్యూ జెడ్11xa ఫోన్ లాంచ్ కాగా భారత మార్కెట్లో ఇప్పుడు సేల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు వచ్చిన ఐక్యూ Z11 సిరీస్‌లో ఇదే చీపెస్ట్ ఫోన్.
కంపెనీ ఇటీవలే ఐక్యూ జెడ్11ఎక్స్ ఫోన్ ధరను రూ.4వేల వరకు పెంచింది. ఈ కొత్త ఐక్యూ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇప్పుడు కొంటే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ అదిరే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐక్యూ జెడ్11xaపై ఆఫర్లు :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అనే సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ధర రూ.28,999కు లభిస్తుంది. భారత మార్కెట్లో అమెజాన్ ద్వారా డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ సమయంలో ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.
అదనంగా, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఐక్యూ ఫోన్ ప్రిస్మాటిక్ గ్రీన్ టైటాన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత రూ.27,499కు సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇతర డిస్కౌంట్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ధర ఇంకా తగ్గుతుంది.
ఐక్యూ జెడ్11xa ఫీచర్లు :
ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ 6.76-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ టాప్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు ఉంటుంది. IP68, IP69 రేటింగ్‌లతో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ గేమింగ్ కోసం అదిరిపోయే ఫీచర్లను అందిస్తుంది. ఇందులో ఏఐ వాయిస్ ఛేంజర్ కూడా ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ గేమింగ్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై రన్ అవుతుంది. ఇందులో పవర్‌ఫుల్ 7200mAh బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో డ్యూయల్ 5జీ సిమ్ కార్డ్‌లు, వై-ఫై బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
