Iranian Prayer App ( Image Credit : Gemini AI)
Iranian Prayer App : పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధంలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌లోని పాపులర్ నమాజ్ యాప్‌ను హ్యాక్ చేసింది. ఇరాన్ సైనిక సభ్యులను వెంటనే లొంగిపోయి పాలన నుంచి వైదొలగాలని కోరుతూ పుష్ నోటిఫికేషన్‌లను పంపింది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఈ సందేశాలు శనివారం తెల్లవారుజామున పంపించారు. ఇరాన్ దేశవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లకు ఈ సందేశం చేరింది. ఈ నోటిఫికేషన్‌లో సైనిక సిబ్బంది, ఇరాన్ ప్రజలను ప్రభుత్వం నుంచి వైదొలగి దేశానికి విముక్తి కోసం పోరాటంలో చేరాలని కోరినట్లు తెలిసింది.
ఇరాన్‌కు డిజిటల్ వార్నింగ్ :
నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ పుష్ నోటిఫికేషన్ల ప్రకారం. “ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇరాన్ అమాయక ప్రజలపై క్రూరమైన చర్యలకు పాల్పడిన వారంతా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇరాన్ దేశాన్ని రక్షించే పోరాటంలో చేరే ఎవరికైనా క్షమాభిక్షతో పాటు క్షమాపణ లభిస్తుంది” అని పేర్కొంది.
మిడిల్ ఈస్ట్‌లో టెక్ టెన్షన్.. :
“మన ఇరాన్ సోదర సోదరీమణుల స్వేచ్ఛ కోసం అణచివేత శక్తులకు పిలుపునిస్తున్నాం. మీ ఆయుధాలను వదిలివేయండి లేదంటే విముక్తి దళాలలో చేరండి. ఇలా మాత్రమే మీ ప్రాణాలను కాపాడుకోగలరు. ఇరాన్ స్వేచ్ఛ కోసమే ఇదంతా అంటూ మరో సందేశం పంపింది ఇజ్రాయెల్.
యాప్ హ్యాక్‌తో కొత్త ఉద్రిక్తత :
ఇరానియన్లు నమాజ్ కోసం ఎక్కువగా వాడే యాప్ (బడేసబా క్యాలెండర్)లో ఒక్కసారిగా అనేక సందేశాలు వచ్చాయి. ఈ యాప్ హ్యాక్ కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాలామంది యూజర్లు ఫోన్లలో ఈ యాప్ ఓపెన్ చేయగానే భద్రతా దళాలు, సైనిక సభ్యులను ప్రస్తుత నాయకత్వం నుంచి వైదొలగాలంటూ హెచ్చరికలు కనిపించాయి.
ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్న సమయంలో ఈ నమాజ్ యాప్ హ్యాక్ జరిగింది. సైబర్ ఆపరేషన్ మిలిటరీ యాక్షన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ సైకాలాజికల్ వార్ అంటున్నారు.
ఇజ్రాయెల్ అధికారులు ఈ సైబర్ ఆపరేషన్‌ను బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, ఇరాన్ సెక్యూరిటీ సిస్టమ్‌లో భారీ వ్యూహంలో భాగంగానే ఈ హ్యాక్ జరిగి ఉంటుందని నివేదిక తెలిపింది. అయితే, ఇరాన్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, గతంలో, ఘర్షణల సమయంలో విదేశీ ప్రభుత్వాలు సైబర్ దాడులు నిర్వహిస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది.