itel ACE 4 Shine : సూపర్ ఫోన్ భయ్యా.. జస్ట్ రూ. 1059కే కొత్త ఫీచర్ ఫోన్‌.. 9 భాషలకు సపోర్టు..!

itel ACE 4 Shine : ఐటెల్ కంపెనీ నుంచి సరికొత్త ఫీచర్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 8 రోజుల బ్యాటరీ లైఫ్‌తో ఐటెల్ ఏస్ 4 షైన్ ఫీచర్ ఫోన్ వచ్చేసింది. ధర ఎంతంటే?

  • Published on- September 24, 2026 / 07:39 PM IST

itel ACE 4 Shine

  • ఐటెల్ ఏస్ 4 షైన్ 1,000mAh బ్యాటరీతో వస్తుంది
  • ఈ ఫోన్ 8.3 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది
  • 1.77-అంగుళాల QQVGA డిస్‌ప్లే కూడా ఉంది

itel ACE 4 Shine : ఐటెల్ కొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసింది. ఐటెల్ ACE 4 షైన్‌ను భారత మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఫోన్‌లో లాంగ్ టైమ్ లైఫ్ అందించే 1,000mAh బ్యాటరీ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. ఆడియో, మీడియా కోసం రికార్డింగ్‌తో వైర్‌లెస్ ఎఫ్ఎమ్ అందిస్తుంది. ఐటెల్ ఏస్ 4 షైన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలివే..

ఐటెల్ ఏస్ 4 షైన్ ధర :
ధర విషయానికి వస్తే.. ఐటెల్ ఏస్ 4 ధర రూ. 1,059గా ఉంది. ఈ ఫీచర్ ఫోన్ ఐటెల్ ఆఫ్‌లైన్ స్టోర్ పార్టనర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. బ్లాక్, మ్యాజిక్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : iPhone Air Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?

ఐటెల్ ఏస్ 4 షైన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐటెల్ ఏస్ 4 షైన్ 128×160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.77-అంగుళాల QQVGA డిస్‌ప్లేతో వస్తుంది. UNISOC SC6533G చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 4MB ర్యామ్, 8MB ROM ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. టైప్-సి ఛార్జింగ్‌తో 1,000mAh బ్యాటరీతో వస్తుంది. 8.3 గంటల వరకు టాక్ టైమ్, 8 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-సిమ్ 2G, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 9 ఇన్‌పుట్ లాంగ్వేజీలు, 2 భాషల BIS-సర్టిఫైడ్ టెక్స్ట్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఆడియో, మీడియా కోసం వైర్‌లెస్ ఎఫ్ఎమ్, రికార్డింగ్‌తో మీడియా ప్లేయర్‌ను అందిస్తుంది. ఇతర ఫీచర్లలో కింగ్ వాయిస్ (హిందీ, ఇంగ్లీషుకు సపోర్టు), SOS, ఆటో కాల్ రికార్డింగ్, ఫ్లాష్‌లైట్ ఉన్నాయి.