iPhone Air Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?
iPhone Air Price : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సమయంలో ఈ ఐఫోన్ మోడల్ బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone Air Price
- అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్‌పై రూ. 30వేలు ఫ్లాట్ డిస్కౌంట్
- SBI, ICICI యాక్సిస్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 4వేలు తగ్గింపు
- ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఐఫోన్ ఎయిర్ అసలు ధర మరింత తగ్గింపు
iPhone Air Price : కొత్త ఐఫోన్ ఫ్లాగ్షిప్ కొనాలని చూస్తున్నారా? ప్రో మోడల్ కన్నా తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ మోడల్ ధర ఇటీవలే పెరిగింది. కానీ, ఇప్పుడు రూ. 1,49,900కు అమ్ముడవుతోంది. కొత్త iOS 27తో పాటు సిరి ఏఐ కూడా సపోర్టు చేస్తుంది.
ప్రస్తుతం అమెజాన్ ఈ ఐఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ ముగియకముందే అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ ధర ఎంతంటే? :
ఇటీవలి ధరల పెంపు తర్వాత ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర రూ. 149,900 కాగా, ప్రస్తుతం ఈ హ్యాండ్సెట్ రూ. 30వేలు ఫ్లాట్ ధర తగ్గింపుతో రూ. 119,900కే లభిస్తోంది. అంతేకాదు.. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మీరు రూ. 4వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
లేదంటే, నెలకు కేవలం రూ. 4,215 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌తో ఎక్స్చేంజ్ కూడా చేయవచ్చు. అయితే, మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి రూ. 42వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందొచ్చు.
ఐఫోన్ ఎయిర్ కొనాలా? వద్దా? :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఆరుబయట వాడితే ఈ ఐఫోన్ మోడల్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ చేరుకోగలదని కూడా కంపెనీ పేర్కొంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో ఆపిల్ A19 SoC ప్రాసెసర్ అమర్చారు.
అదనంగా 12GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. కొత్త iOS 27తో పాటు, కొత్త సిరి ఏఐని కూడా సపోర్టు చేస్తుంది.
ఆపిల్ కంపెనీ ఈ ఐఫోన్ ఎయిర్ కోసం 3,100mAh బ్యాటరీ అమర్చగా 20W వైర్డ్ ఛార్జింగ్ 12W మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ ఛార్జర్ కూడా అందిస్తుంది.
కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ 48MP ఫ్యూజన్ సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 18MP లెన్స్ కూడా అమర్చారు. ఐఫోన్ కొనాలా? వద్దా అనేది మీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.
ఆపిల్ ఐఫోన్లపై మరోసారి ధరల పెంపు ఉంటుందనే ఊహాగానాల మధ్య తక్కువ ధరకే ఐఫోన్ కొనేందుకు బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ సమయంలో కూడా ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై మరిన్ని అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.
