Jack Dorsey: కొత్త సోషల్ మీడియా వేదిక తీసుకురానున్న ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే
ఈ కొత్త సోషల్ మీడియా వేదిక పేరు ‘బ్లూస్కీ’ అని ఖరారు చేశారు. ప్రస్తుతం ఇది బీటా పరీక్షలో ఉందని, ప్రోటోకాల్ స్పెక్స్‌పై మళ్లడం లాంటి విషయాలపై పరీక్ష కొనసాగుతున్నట్లు అని కంపెనీ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నెట్వర్క్ అమలు చేసిన తర్వాత దానికి అనేక విభాగాల నుంచి సమన్వయం అవసరమని, అయితే అందులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించేందుకు ఈ వేదికను బీటాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
- tony bekkal
- Published On : October 30, 2022 / 03:48 PM IST
Jack Dorsey Plans An Alternative
Jack Dorsey: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడం పట్ల బహుశా కొంత మంది అసంతృప్తితో ఉండవచ్చు. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే పదవీ విరమణ తీసుకున్నప్పుడే చాలా మంది బాహాటంగానే తమ అసంతృప్తిని, విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇక ట్విట్టర్‌కు తాము దూరమంటూ ప్రకటించిన వారు కూడా లేకపోలేదు. ఇలాంటి వారి కోసం ఒక గుడ్ న్యూస్. ట్విట్టర్ కో-ఫౌండర్ అయిన జాక్ డోర్సే నూతన సామాజిక మీడియా వేదికను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారట. మరి కొద్ది రోజుల్లో కొత్త సోషల్ మీడియా వేదిక అందుబాటులోకి రానున్నట్లు కూడా చెప్తున్నారు.
యాప్ ద్వారా తీసుకు రానున్న ఈ కొత్త సోషల్ మీడియా వేదిక పేరు ‘బ్లూస్కీ’ అని ఖరారు చేశారు. ప్రస్తుతం ఇది బీటా పరీక్షలో ఉందని, ప్రోటోకాల్ స్పెక్స్‌పై మళ్లడం లాంటి విషయాలపై పరీక్ష కొనసాగుతున్నట్లు అని కంపెనీ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నెట్వర్క్ అమలు చేసిన తర్వాత దానికి అనేక విభాగాల నుంచి సమన్వయం అవసరమని, అయితే అందులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించేందుకు ఈ వేదికను బీటాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వారం రోజుల క్రితం డోర్సే ట్విట్టర్ వేదికగా ద్వారా స్పందిస్తూ సోషల్ మీడియా లేదంటే దానిని ఉపయోగించే వ్యక్తుల డేటా కోసం అంతర్లీన ఫండమెంటల్స్‌ను స్వంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఏదైనా కంపెనీకి పోటీదారుగా ఉండాలని తాము భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. సోషల్ మీడియా దిగ్గజం కోసం ఇదే విధమైన వికేంద్రీకృత భావనను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి బ్లూస్కీని మొదట 2019లో ట్విట్టర్ స్థాపించింది. డోర్సే మే 2022లో ట్విట్టర్ బోర్డు నుండి తప్పుకున్నారు. నవంబర్ 2021లో ట్విట్టర్ సీఈవో పదవి నుండి తప్పుకున్నారు.
Modi as God Avatar: అందుకే మోదీ అవతార పురుషుడు.. తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్న యూపీ మంత్రి
