Modi as God Avatar: అందుకే మోదీ అవతార పురుషుడు.. తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్న యూపీ మంత్రి

మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారా అని విపక్ష నేతలు ప్రశ్నించగా.. ‘‘మోదీ అవతార పురుషుడు లాంటి వాడు. చాలా అద్భుతమైన జ్ణానం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు పోటీ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆయన అనకుంటే, ఆయన మరణం వరకు ఆయనే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటారు’’ అని గులాబ్ దేవి అన్నారు. అంతే కాకుండా, దేశం మొత్తం ఆయన చెప్పే మాటల్ని ఆచరిస్తోందని, ఒక వ్యక్తి గొప్పతనానికి అంతకంటే ఉదహారణ ఏం కావాలని ఆమె ప్రశ్నించారు.

Modi as God Avatar: అందుకే మోదీ అవతార పురుషుడు.. తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్న యూపీ మంత్రి

UP minister explains why pm Modi as God avatar

Modi as God Avatar: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవతార పురుషుడని, ఆయన కోరుకుంటే మరణించేంత వరకు తానే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటారని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. తాను అనుకున్న పనులు వెంటనే జరిగిపోతే ఆ వ్యక్తిని దైవ స్వరూపుడే అనాలని గులాబ్ దేవి తాజాగా వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై ఆమె కొన్ని ఉదాహారణలు సైతం ఇచ్చారు.

‘‘ఆయన (మోదీ) పేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలనుకోగానే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయన ప్రజలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అనుకోగానే వెంటనే దేశంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్ అందుతోంది. మరుగుదొడ్ల నిర్మాణం గురించి ఆయన అనుకున్నా, మరింకేది అనుకున్నా.. అనుకున్న వెంటనే పనులు ప్రారంభమవుతున్నాయి, ప్రజలు లబ్ది పొందుతున్నారు. మరి అలాంటి వ్యక్తిని దేవుడిలానే భావించాలి’’ అని గులాబ్ దేవి అన్నారు.

ఈ నెల 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అయితే ఆ కార్యక్రమంలో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారా అని విపక్ష నేతలు ప్రశ్నించగా.. ‘‘మోదీ అవతార పురుషుడు లాంటి వాడు. చాలా అద్భుతమైన జ్ణానం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు పోటీ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆయన అనుకుంటే, ఆయన మరణం వరకు ఆయనే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటారు’’ అని గులాబ్ దేవి అన్నారు. అంతే కాకుండా, దేశం మొత్తం ఆయన చెప్పే మాటల్ని ఆచరిస్తోందని, ఒక వ్యక్తి గొప్పతనానికి అంతకంటే ఉదహారణ ఏం కావాలని ఆమె ప్రశ్నించారు.

ప్రధాని మోదీకి ఇలాంటి పొగడ్తలు కొత్తేం కాదు. గతంలో ఆయనను మహానుభావులతో, పురాణ పురుషులతో పోలుస్తూ అనేక మంది పొగడ్తలు కురిపించారు. సందర్భం వచ్చినప్పుడుల్లా బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి 2014లో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. 2019 ఎన్నికల ప్రచారంలో.. దేశ సేవపై తనకు వ్యామోహం తీరలేదని, వీలైనంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉంటానంటూ పరోక్షంగా తన మనసులోని కోరికను మోదీ వెల్లడించారు.

Delhi CM Arvind Kejriwal: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్‌ను బీజేపీ ఎందుకు తీసుకురావడం లేదు?