Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్.. 500GB డేటా, 200 రోజుల వ్యాలిడిటీ, జియోహాట్‌స్టార్‌ 90 రోజులు ఫ్రీగా చూడొచ్చు..!

Jio Cheapest Plan : రిలయన్స్ జియో లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్.. 200 రోజుల వ్యాలిడిటీ, జియోహాట్‌స్టార్ 90 రోజులు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు.

Jio Cheapest Plan

Jio Cheapest Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఎప్పటికప్పుడూ సరికొత్త రీఛార్జ్ (Jio Cheapest Plan) ప్లాన్లను ప్రవేశపెడుతోంది. జియో ప్లాన్లలో 200 రోజుల వ్యాలిడిటీతో వచ్చే జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది.

డేటాతోపాటు లాంగ్ వ్యాలిడిటీ, ఓటీటీ బెనిఫిట్స్ కోరుకునే యూజర్ల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో అందించే ప్లాన్లలో రూ. 2025 ప్లాన్, రూ. 1029 ప్లాన్ లభ్యమవుతున్నాయి. ఈ రెండింటిలో ఏ రీఛార్జ్ ప్లాన్ కావాలో మీరే ఎంచుకోండి.

జియో రూ.2025 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ.2,025 ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. జియో ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఫ్రీ అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. జియో యూజర్లు మొత్తం 500GB డేటాను పొందవచ్చు.

Read Also : PPF Scheme : మీ జీతం పడగానే ఫస్ట్ ఈ స్కీమ్‌లో చేరండి.. ప్రతినెలా జస్ట్ రూ. 4,585 పెట్టుబడితో రూ.కోటికి పైగా సంపాదించుకోవచ్చు!

ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఫ్రీ SMS పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఇతర బెనిఫిట్స్‌తో పాటు యూజర్లకు జియో హాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు ఫ్రీ యాక్సెస్‌ అందిస్తుంది.

జియో రూ.1029 ప్లాన్ :
జియో రూ.1029 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 168GB డేటా అందుబాటులో ఉంది. అదనంగా, ప్లాన్ ఇంటర్నెట్ డేటాను ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది. అదనంగా, ఈ జియో ప్లాన్ రోజుకు 100 ఫ్రీ SMSలను కూడా అందిస్తుంది.