PPF Scheme : మీ జీతం పడగానే ఫస్ట్ ఈ స్కీమ్‌లో చేరండి.. ప్రతినెలా జస్ట్ రూ. 4,585 పెట్టుబడితో రూ.కోటికి పైగా సంపాదించుకోవచ్చు!

PPF Scheme : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ఈ గవర్నమెంట్ స్కీమ్‌లో చేరండి.. ప్రతినెలా పెట్టుబడితో రూ. 1.03 కోట్ల రాబడి పొందవచ్చు.

PPF Scheme : మీ జీతం పడగానే ఫస్ట్ ఈ స్కీమ్‌లో చేరండి.. ప్రతినెలా జస్ట్ రూ. 4,585 పెట్టుబడితో రూ.కోటికి పైగా సంపాదించుకోవచ్చు!

PPF Scheme

Updated On : July 4, 2025 / 6:37 PM IST

PPF Scheme : జీతం పడగానే ఫస్ట్ మీరు ఈ పనిచేయండి.. సాధారణంగా చాలామంది జీతం పడగానే ఖర్చుల గురించే ఆలోచిస్తారు. సేవింగ్స్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. మీ భవిష్యత్తు (PPF Scheme) ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పటినుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ప్రస్తుతం మార్కెట్లో అనేక ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది అద్భుతమైన పథకం..

ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సెక్షన్ 80C కింద మీకు రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు సంపాదించే వడ్డీపై కూడా పన్ను ఉండదు.

వాస్తవానికి, 25 ఏళ్ల వరకు పెట్టుబడి కొనసాగించవచ్చు. ప్రతి నెలా రూ. 12,500 పెట్టుబడి పెడితే.. మీ వార్షిక పెట్టుబడి రూ. 1.5 లక్షలు అవుతుంది. 25 ఏళ్ల తర్వాత దాదాపు రూ. 1.03 కోట్లు పొందవచ్చు. ఇందులో దాదాపు రూ. 65 లక్షలు వడ్డీనే వస్తుంది.

వడ్డీ రేటు ఎంతంటే? :
ప్రస్తుతం PPF ప్రతి ఏడాదికి 7.1శాతం వడ్డీని చెల్లిస్తుంది. కాంపౌండ్ వడ్డీగా చెప్పవచ్చు. మీరు పెట్టే డబ్బుపై మాత్రమే కాకుండా సంపాదించే వడ్డీపై కూడా వడ్డీని పొందవచ్చు అనమాట.

Read Also : Vivo Y300 5G : వావ్.. కిర్రాక్ ఆఫర్ అంతే.. ఈ వివో 5G ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇలా కొన్నారంటే?

ఎంత పెట్టుబడి అవసరం? ఎంతకాలం పెట్టాలి? :
ఈ పథకంలో మీరు ఏడాదిలో కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట మొత్తం రూ. 1.5 లక్షలు. ముందుగా ఈ పథకం 15 ఏళ్లు రన్ అవుతుంది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు రెండుసార్లు పెంచవచ్చు. అవసరమైతే.. ఈ పథకాన్ని 25 ఏళ్లు కొనసాగించవచ్చు. ప్రతి నెలా రూ. 12,500 పెట్టుబడి పెడుతూ పోతే రూ. 1 కోటికి పైగా సంపాదించవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా రూ. 4,585 పెట్టుబడి పెడితే.. 25 ఏళ్లలో మీకు రూ. కోటి (రూ.1.03)కి పైగా చేతికి అందుతుంది.

టాక్స్ బెనిఫిట్స్ ఇలా :
పీపీఎఫ్ పథకంలో (PPF) పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే.. వడ్డీ ఆదాయంపై కూడా పన్ను పడదు. మీ స్కీమ్ క్లోజ్ చేశాక వచ్చే మొత్తం డబ్బుపై కూడా పన్ను రహితంగా ఉంటుంది. మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే PPF పథకం అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం పెట్టుబడిపై అవగాహన కోసం మాత్రమే.. PPF వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి..