Jio Cheapest Plan
Jio Cheapest Plan : జియో యూజర్లకు అలర్ట్.. రిలయన్స్ జియో సైలెంట్‌గా ఆ ప్రీపెయిడ్ ప్లాన్ ఎత్తేసింది. ఇప్పటివరకూ జియో నెలవారీ ప్లాన్ (Jio Cheapest Plan) రూ. 249 అందించేది. వాస్తవానికి ఇది ఈ 4G ప్లాన్. ఇప్పటినుంచి యూజర్లకు అందుబాటులో ఉండదు. ఇప్పటికే జియో 2 అంచెల ప్లాన్‌లను కలిగి ఉంది.
అందులో ట్రూ 5G సర్వీసులు, మరొకటి రోజుకు లిమిటెడ్ డేటాను మాత్రమే అందించే ప్లాన్లు. ఇప్పుడు, డెయిలీ డేటా లిమిట్ ప్లాన్‌లు సరసమైన ధరకే లభిస్తున్నాయి. ఈ లిస్టులో అత్యంత ఖరీదైనది రూ. 249 నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్. ఇప్పుడు జియో ఇదే ప్లాన్ సైలెంట్‌గా ఎత్తేసింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1GB డేటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర బెనిఫిట్స్ అందిచేది. ఇకపై ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉండదు.
నెలవారీ రూ.249 ప్లాన్ జియో తొలగించడంతో ఇక, బేస్ టారిఫ్ ఆఫర్ రూ.299 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ JioTV, JioAICloud సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజుకు 1.5GB డేటా, మొత్తం 42GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
రోజుకు 2GB కన్నా తక్కువ డేటాను అందించే ఏ ప్లాన్‌లోనూ ఫ్రీ 5G సర్వీసులను పొందలేరు. అలాగే, రోజుకు 2GB ప్లాన్‌కి మారితే జియో నేరుగా OTT యాప్ సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు ట్రూ 5G సర్వీసులను ఫ్రీగా అందిస్తుంది.
Read Also : Paytm Users : పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31 లోపు ఈ పని చేయండి.. లేదంటే భారీగా నష్టపోతారు!
ఉదాహరణకు.. జియో రూ. 349 ప్లాన్ రోజుకు 2GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. జియో ట్రూ 5G సర్వీసులతో పాటు 90 రోజుల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. సాధారణంగా ప్రతిరోజూ ప్లాన్ ద్వారా అందించే 2GB 4G డేటా రిఫ్రెష్ అవుతుంది. 5Gకి సపోర్టు చేయని చోట 4G డేటా యాక్టివ్ అవుతుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. దేశంలో 5G ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 4G ఫోన్ల అమ్మకాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 5G ఫోన్లు ఉన్న యూజర్లు 5G రెడీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసమే చూస్తారు. రాబోయే రోజుల్లో జియో, ఎయిర్‌టెల్ వంటి టెల్కో దిగ్గజాలు 5G రెడీ ప్లాన్లను ప్రవేశపెట్టి 4G ప్లాన్లను పూర్తిగా తొలగించే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడు జియో కూడా రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ సైలెంట్‌గా తొలగించడానికి 4G ప్లాన్లకు స్వస్తి చెప్పనున్నట్టు తెలుస్తోంది. దేశంలో 5G నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పటివరకూ 4G ప్లాన్లను కూడా కొనసాగించే అవకాశం ఉంది.