Jio Diwali Dhamaka offers free 1-year AirFiber subscription
Jio Diwali Dhamaka Offer : అసలే పండుగ సీజన్.. దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ధమాకా ఆఫర్‌తో కస్టమర్లు ఏడాది పాటు ఫ్రీ ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ను పొందవచ్చు. జియో కొత్త ప్లాన్‌లతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలా ప్లాన్ సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జియో దీపావళి ఆఫర్ :
దీపావళి ధమాకా ఆఫర్ కింద జియో నిర్దిష్ట రీఛార్జ్ వాల్యూను పొందవచ్చు. ఎయిర్‌ఫైబర్ సర్వీసుకు ఏడాది ఫ్రీ సభ్యత్వాన్ని అందిస్తోంది. కస్టమర్‌లు తమ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రిలయన్స్ డిజిటల్ కూపన్‌లను అందుకుంటారు.
ఈ ప్లాన్‌లో ఇంకా ఏమి ఉన్నాయంటే? :
800+ టీవీ ఛానెల్‌లు : సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్ కంటెంట్ కోసం టెలివిజన్ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
13+ ఓటీటీ యాప్‌లు : వినియోగదారులు 13 కన్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.
అన్‌లిమిటెడ్ వై-ఫై : ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ కోసం డేటా క్యాప్‌లు లేకుండా కనెక్ట్ అయ్యేలా అనుమతిస్తుంది.
ఫ్రీ ఇన్‌స్టాలేషన్ : రూ. వెయ్యి విలువైన కాంప్లిమెంటరీ ఇన్‌స్టాలేషన్ కూడా పొందవచ్చు.
ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు రూ. 599 నుంచి ప్రారంభం :
జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసు వివిధ రకాల ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. రూ. 599 నుంచి ప్రారంభమవుతాయి.
రూ. 599 ప్లాన్ : 800+ టీవీ ఛానెల్‌లతో 30ఎంబీపీఎస్ స్పీడ్ 11+1 ఓటీటీ యాప్ యాక్సెస్ ఉచితంగా వై-ఫై 6 రూటర్.
రూ. 888 ప్లాన్ : 30ఎంబీపీఎస్ స్పీడ్, 11+3 ఓటీటీ యాప్‌లు, ప్రీమియం యాక్సెస్‌తో పాటు 4కె సెట్-టాప్ బాక్స్‌తో వస్తుంది.
రూ. 899 ప్లాన్ : ఎంటర్‌టైన్మెంట్ ఆఫర్‌లతో స్పీడ్ 100ఎంబీపీఎస్ వరకు పొందవచ్చు.
రూ. 1,199 ప్లాన్ : 11+4 ప్రీమియం ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌తో పాటు 100ఎంబీపీఎస్ స్పీడ్‌ని అందిస్తుంది.
జియో దీపావళి ఆఫర్ ఎలా పొందాలంటే? :
జియో వెబ్‌సైట్ లేదా జియో యాప్‌ని ఓపెన్ చేయండి.
మీ లొకేషన్‌లో సర్వీసు అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి.
మీ మొబైల్ నంబర్, పిన్ కోడ్‌తో మీ వివరాలను ఎంటర్ చేయండి.
మీకు ఇష్టమైన ప్లాన్‌ని ఎంచుకుని, రీఛార్జ్ చేయండి.
మీ ఆఫర్‌ను కన్ఫార్మ్ చేయండి.
అదనపు బెనిఫిట్స్‌తో పాటు ఫ్రీ ఎయిర్‌ఫైబర్ సర్వీసును పొందవచ్చు. జియో దీపావళి ధమాకా ప్రస్తుత ఇంటర్నెట్ సర్వీస్‌కు అప్‌గ్రేడ్, ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.