టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఇతర టెలికం ఆపరేటర్లు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఆఫర్ల దెబ్బకు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రివైజ్ చేసింది.
టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఇతర టెలికం ఆపరేటర్లు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు, మరో నెట్ వర్క్ కు యూజర్లు మారకుండా ఉండేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్లతో ముందుకు వస్తున్నాయి. ఎగ్జిస్టింగ్ ప్లాన్ లను కూడా రివైజ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
జియో ఆఫర్ల దెబ్బకు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రివైజ్ చేసింది. ప్రస్తుత రూ.509 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను రివైజ్ చేసింది. ఈ ప్లాన్ పై రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడెటీ అందిస్తోంది. రివైజ్ చేసిన రీఛార్జ్ ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు.
Also Read : ఆండ్రాయిడ్ లో ‘గూగుల్ అసిస్టెంట్’ ఇంటిగ్రేషన్
అంతేకాదు.. వోడాఫోన్ ప్లే యాప్ పై లైవ్ టీవీ, మూవీలను కూడా వీక్షించవచ్చు. వోడాఫోన్ అందించే మరో రూ. 529 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో అందించే బెనిఫెట్స్ రూ.509 రీఛార్జ్ ప్లాన్ లో ఆఫర్ చేస్తోంది. అయితే రివైజ్ చేసిన రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లను ఢిల్లీ ఎన్ సీఆర్, గుజరాత్, అస్సాం, చెన్నై, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్ టెలికం సర్కిల్స్ లోని యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పటివరకూ రూ.509 రీఛార్జ్ ప్లాన్ పై 1.4జీబీ డేటాను అందించగా.. రివైజ్ చేసిన అనంతరం రోజుకు 1.5జీబీ డేటా (అదనంగా 100ఎంబీ) డేటాను అందిస్తోంది. దీంతో వోడాఫోన్ యూజర్లు రూ. 20 వరకు బెనిఫెట్ పొందొచ్చు. రూ.529 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పై అందించే బెనిఫెట్స్ ను పొందొచ్చు.