Jio Fiber Non Stop Plan : జియో ఫైబర్ ఉండగా.. దిగులు ఎందుకు దండగ.. కేవలం రూ.398కే నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. మరెన్నో బెనిఫిట్స్..!

Jio Fiber Non Stop Plan : జియోఫైబర్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 398కే నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.

Jio Fiber Non Stop Entertainment Broadband Plan 2023 Launched in India

Jio Fiber Non Stop Plan : అసలే వర్షాకాలం.. అందులోనూ ఎడతెగని వర్షాలు.. బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఊరికే ఇంట్లో కూర్చొంటే బోరుగా ఫీలవుతారు కదా.. అందుకే ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా ఉండేందుకు జియోఫైబర్ తమ యూజర్ల కోసం స్పెషల్ మాన్‌సూన్ ప్లాన్ ఆఫర్‌ తీసుకొచ్చింది. కేవలం రూ.398కే ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. దేశీయ టెలికం రంగంలో తిరుగులేని రిలయన్స్‌ జియో (Reliance Jio) తమ జియో ఫైబర్ (Jio Fiber) సర్వీసు ద్వారా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

ఈ కొత్త జియోఫైబర్ టీవీ ప్లాన్ (Jio Fiber TV Plans) ద్వారా వర్షాకాలంలోనూ అంతరాయం లేని కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా పేరొందిన జియోఫైబర్ (JioFiber) అత్యంత సరసమైన ధర రూ. 398కే జియో టీవీ నెలవారీ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : JioBook Laptop Launch : జియోబుక్ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

జియో ఫైబర్ టీవీ ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :
జియో ఫైబర్ నాన్‌స్టాప్ ప్లాన్ ద్వారా 750కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను అందిస్తుంది. Amazon Prime, Netflix, Disney Hot Star, Zee5, SunNxt, SonyLiv సహా 14 మోస్ట్ పాపులర్ ప్రీమియం OTT కంటెంట్ అందించే ప్లాట్‌ఫారమ్‌లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌లు నచ్చిన టీవీ షోలు, మూవీలను నాన్‌స్టాప్‌గా ఎంజాయ్ చేయొచ్చు.

Jio Fiber Non Stop Entertainment Broadband Plan 2023 Launched in India

అంతేకాదు.. అన్‌లిమిటెడ్ డేటాతో కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ ప్లాన్, స్ట్రీమింగ్, బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఇంకా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచిత ల్యాండ్‌లైన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కాల్ ఛార్జీల విషయంలోనూ వినియోగదారులు ఎలాంటి రాజీపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.

ఈ మాన్‌సూన్ ఆఫర్‌ ద్వారా కస్టమర్‌లు ఫ్రీగా 4K సెట్-టాప్ బాక్స్‌తో పాటు రూ.10వేల విలువైన ఫ్రీ గిగారూటర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. అదనంగా, జియో ఫైబర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కస్టమర్‌లకు జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, జీరో డిపాజిట్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ స్పెషల్ ప్లాన్ ఆఫర్ పొందాలంటే జియోఫైబర్ యూజర్లు 6 నెలలకు అడ్వాన్స్ రీఛార్జ్‌ ఎంచుకోవాలి.

ఆసక్తిగల జియోఫైబర్ కస్టమర్లు తమకు సమీపంలోని జియో స్టోర్‌ని సంప్రదించడం లేదా (www.jio.com/fiber)కి లాగిన్ చేయడం ద్వారా ఈ ప్లాన్‌ పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే రూ.398 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఎంజాయ్ చేయండి.

Read Also : Twitter Gold Tick : బ్రాండ్ అకౌంట్లకు మస్క్ కొత్త ఫిట్టింగ్.. ట్విట్టర్‌లో యాడ్స్‌పై నెలకు రూ. 81 వేలు ఖర్చు పెడితేనే గోల్డ్ టిక్..!

ట్రెండింగ్ వార్తలు