Jio Hotstar : గుడ్ న్యూస్.. ఆగస్టు 15న జియోహాట్‌స్టార్ అందరూ ఫ్రీగా చూడొచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Jio Hotstar

Jio Hotstar : ఓటీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జియో హాట్‌స్టార్ యూజర్లందరికి ఉచితంగా కంటెంట్‌ను (Jio Hotstar) అందిస్తోంది. ఈ రోజున వినియోగదారులు లాగిన్ అవ్వాలి. జియో హాట్‌స్టార్ అన్ని షోలు, వెబ్ సిరీస్‌లను ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వీక్షించవచ్చు.

ఆగస్టు 15న OTT యాప్‌లోని మొత్తం కంటెంట్ ఫ్రీగా చూడొచ్చు. జియో హాట్‌స్టార్ మొత్తం కంటెంట్‌ను అందరికీ ఉచితంగా అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జియో హాట్‌స్టార్ అన్ని షోలు, వెబ్‌సిరీస్‌లను ఫ్రీగా వీక్షించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్‌ ఫ్రీగా చూడొచ్చు :
ఆగస్టు 15న సైట్, యాప్‌లలో ఫ్రీగా జియో హాట్‌స్టార్ కంటెంట్‌ యాక్సస్ చేయొచ్చు. “ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ” అనే ట్యాగ్‌లైన్‌తో పొందవచ్చు. ప్రతి ఒక్కరూ జియో హాట్‌స్టార్ కంటెంట్‌ను చూడొచ్చు. మొబైల్ లేదా టీవీ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. జియో హాట్‌స్టార్‌లో సలాకార్ అనే కొత్త సిరీస్ కూడా వస్తోంది. ఇదో డిటెక్టివ్ స్టోరీ. ఆగస్టు 15న ఈ సిరీస్‌ను ఫ్రీగా వీక్షించవచ్చు.

Read Also : Starlink Plans : అతి త్వరలో స్టార్‌లింక్ ప్రారంభం.. ప్లాన్‌లు, ధరలు, లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్..

ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది :
ఈ ఆఫర్ విషయానికి వస్తే.. జియోహాట్‌స్టార్ పొందాలంటే జియో యూజర్ కానవసరం లేదు. ఎందుకంటే JioHotstar బండిల్ ఆఫర్ Airtel, Vi అనేక ప్లాన్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఒకసారి లాగిన్ అయితే చాలు.. యాప్‌లోని ఏదైనా కంటెంట్‌ను యాక్సస్ చేయొచ్చు. జియోహాట్‌స్టార్‌లో ఎంచుకున్న కంటెంట్ ఫ్రీగా పొందవచ్చు. ఆగస్టు 15న అన్ని కంటెంట్ 24 గంటలు ఫ్రీగా పొందవచ్చు.

ఆగస్టు 15 తర్వాత రీఛార్జ్ కొనసాగించొచ్చు :
ఆగస్టు 15న జియో హాట్‌స్టార్ కంటెంట్ మీకు నచ్చితే చౌకైన రీఛార్జ్ చేయడం ద్వారా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. జియో, ఎయిర్‌టెల్ యూజర్లు ఇద్దరూ అనేక చౌకైన ప్లాన్లతో ఆప్షన్ పొందవచ్చు. జియో యూజర్ అయితే రూ.100 రీఛార్జ్ చేయడం ద్వారా తదుపరి 3 నెలల పాటు జియో హాట్‌స్టార్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ రూ. 100కు బదులుగా 90 రోజులకు 5GB డేటాను పొందవచ్చు.

ఈ డేటా పూర్తి అయ్యాక కూడా Wi-Fi ద్వారా జియో హాట్‌స్టార్‌ యాక్సెస్ చేయొచ్చు. మరోవైపు, ఎయిర్‌టెల్ యూజర్ అయితే రూ.100కి నెల పాటు 5GB డేటాతో జియో హాట్‌స్టార్‌ను యాక్సెస్ చేయొచ్చు. అదే సమయంలో, 90 రోజుల యాక్సెస్ కోసం రూ.195 డేటా వోచర్‌తో రీఛార్జ్ చేయాలి.