Jio OTT Pass : ఓటీటీ లవర్స్‌కు పండగే.. జియో పాస్‌తో జాక్‌పాట్.. రూ. 200కే 15 యాప్స్, 1000 ఛానెల్స్!

Jio OTT Pass : రిలయన్స్ జియో కొత్త రూ. 200 జియో ఓటీటీ పాస్‌ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్యాక్‌లో అనేక డిజిటల్ బెనిఫిట్స్ అందిస్తుంది. తద్వారా నెలకు సుమారు రూ. 1,500 విలువైన బెనిఫిట్స్ అందిస్తుంది.

Jio OTT Pass ( Image Credit : AI )

  • జియో కొత్త రూ. 200 ఓటీటీ పాస్ ప్రారంభం
  • జియో నెలకు సుమారు రూ. 1,500 విలువైన బెనిఫిట్స్
  • రూ. 200తో ఓటీటీ పాస్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ, హై-స్పీడ్ కనెక్టివిటీ

Jio OTT Pass : జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఎంటర్‌టైన్మెంట్, కనెక్టివిటీతో సింగిల్ ప్లాన్‌ వచ్చేసింది. రిలయన్స్ జియో నెలకు సుమారు రూ. 1,500 విలువైన బెనిఫిట్స్ అందించే కొత్త రూ. 200 జియో ఓటీటీ పాస్‌ను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ప్లాన్‌లో 28 రోజుల పాటు (Jio OTT Pass) ఒకే ప్యాక్‌లో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లకు యాక్సెస్, జియోటీవీలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్, 30GB హై-స్పీడ్ డేటా, యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తాయి.

కంపెనీ ప్రకారం.. ఈ కొత్త పాస్ మే 27, 2026 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెళ్లలో అందుబాటులో ఉంటుంది. యాక్టివ్ బేస్ ప్లాన్ జియో యూజర్ల అందరికి అందుబాటులో ఉంది. స్పెషల్ ఎంటర్‌టైన్మెంట్ కొత్త రూ. 200 జియో ఓటీటీ పాస్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ, హై-స్పీడ్ కనెక్టివిటీని సరసమైన ధరకే అందిస్తోంది.

ఆసక్తిగల యూజర్లు నెలకు సుమారు రూ. 1,500 విలువైన బెనిఫిట్స్ కేవలం రూ. 200కే పొందుతారు. ఈ కొత్త జియో ఓటీటీ పాస్, ఎంటర్‌టైన్మెంట్, కనెక్టివిటీ కోసం సింగిల్ ప్లాన్‌గా అందుబాటులో ఉంది. సింగిల్ ప్యాక్‌లో అనేక డిజిటల్ బెనిఫిట్స్ అందిస్తుంది.

Read Also : Hero Super Splendor XTEC : హీరో సూపర్ బైక్ వచ్చేసింది.. లీటర్ కొట్టిస్తే.. 72కి.మీ మైలేజీ అందిస్తుంది.. ధర ఎంతో తెలుసా?

జియో పాస్ అందించే బెనిఫిట్స్ ఇవే :

  • ఒకే ప్యాక్‌లో 15 ప్రీమియం OTT సబ్‌స్క్రిప్షన్‌లు
  • యూట్యూబ్ ప్రీమియం, టీవీ, టాబ్లెట్, మొబైల్‌లో యాడ్ ఫ్రీ వ్యూ, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు
  • జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ : లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్
  • ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ : మొబైల్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో
  • జియోటీవీ ద్వారా 12 ఇతర ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి
  • జియోటీవీలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, ప్రముఖ ప్రసార సంస్థల నుంచి 150కి పైగా పెయిడ్ ఛానెళ్లు
  • జియోస్టార్ : స్టార్ ప్లస్ హెచ్‌డి, కలర్స్ హెచ్‌డీ, ఇతర ఎంటరైన్మెంట్, సినిమా ఛానెళ్లు
  • సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ : SET HD, సోనీ SAB HD ఛానళ్లు
  • సన్ టీవీ నెట్‌వర్క్ : సన్ టీవీ హెచ్‌డి, కేటీవీ హెచ్‌డి, ఇతర ప్రాంతీయ ఎంటర్‌టైన్మెంట్, సినిమా, మ్యూజిక్ ఛానెళ్లు
  • వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ : డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్, ఇతర ఇన్ఫోటైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, వైల్డ్‌లైఫ్, కిడ్స్ ఛానెల్‌లు
  • ఈటీవీ, ఈటీవీ హెచ్‌డీ, ఈటీవీ తెలుగు, ఇతర ప్రాంతీయ ఎంటర్‌టైన్మెంట్, సినిమా ఛానెళ్లు

డేటా బెనిఫిట్స్ :
కొత్త రూ. 200 జియో ఓటీటీ పాస్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో జియో యాప్‌లతో పాటు 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు ఉంటాయి. వినియోగదారులు జియోటీవీ ద్వారా 1,000 పైగా లైవ్ టీవీ ఛానెళ్లను (అదనంగా 150 పెయిడ్ ఛానెళ్లను) కూడా చూడవచ్చు.

ఈ ప్యాక్ 30GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటాను (బేస్ ప్లాన్‌తో 28 రోజుల పాటు) అందిస్తుంది. ఈ ప్లాన్ ధర కేవలం రూ. 200 మాత్రమే కాగా, మొత్తం మీద నెలకు సుమారు రూ. 1,500 విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు.

ఓటీటీ ప్లాన్లు ఇవే :
నివేదిక ప్రకారం.. కొత్తగా రూ. 200 జియో ఓటీటీ పాస్ మే 27, 2026 నుంచి అన్ని టెలికాం సర్కిళ్లలో, అన్ని జియో ఛానెళ్లలో మైజియో యాప్, Jio.com, రిటైల్ పాయింట్స్ ఆఫ్ సేల్ (GT, RR), థర్డ్-పార్టీ రీఛార్జ్ యాప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌ యాక్టివేట్ కోసం యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పక ఉండాలి.