Jio vs Airtel : జియో-ఎయిర్‌టెల్ సింగిల్ రూ. 355 ప్లాన్.. ఏది బెస్ట్ ప్లాన్? ఎందులో బెనిఫిట్స్ ఎక్కువ? ఫుల్ డిటెయిల్స్..!
Jio vs Airtel : జియో, ఎయిర్‌టెల్ యూజర్ల కోసం సరసమైన ప్లాన్లు ఒకే ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్లలో ఎందులో ఎక్కువ వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- May 25, 2026 / 02:59 PM IST
Jio Rs 355 vs Airtel Rs 355
- జియో, ఎయిర్‌టెల్ సింగిల్ ప్లాన్ రూ. 355తో డేటా, కాల్స్ బెనిఫిట్స్
- జియో రీఛార్జ్‌తో డిజిటల్ బెనిఫిట్స్ ఎక్కువ పొందవచ్చు
- ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఆప్షన్
Jio vs Airtel : జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు అద్భుతమైన ప్లాన్.. ధర ఒకటే అయినా బెనిఫిట్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి రీఛార్జ్ ప్లాన్ చూసేవారికి బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. తగినంత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, నెల వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు రూ. 350 లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌లు బెస్ట్.
అయితే, టెలికాం ప్లాన్లు ఇప్పుడు కేవలం డేటా కాలింగ్‌కు మాత్రమే కాదు.. అదనపు బెనిఫిట్స్, క్లౌడ్ స్టోరేజ్, స్ట్రీమింగ్ యాక్సెస్, ఏఐ సబ్‌స్క్రిప్షన్లు కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ రూ. 355 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పోల్చి చూస్తే.. జియో రూ. 355 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ధరతో పాటు బెనిఫిట్స్ కూడా ప్లాన్ ఎంచుకోవచ్చు.
జియో రూ. 355 ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో రూ. 355 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీ, 25GB మొత్తం డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ (Jio vs Airtel) కాలింగ్, రోజుకు 100 SMS లభిస్తాయి. అయితే, డేటా కాలింగ్ బెనిఫిట్స్ కోసం OTT సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్ లభిస్తుంది. 50GB స్టోరేజ్‌తో జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్స్, ఏఐ ఫీచర్లతో 18 నెలల ప్రమోషనల్ గూగుల్ జెమిని ప్రో ఆఫర్ కూడా లభిస్తుంది.
Read Also : Oppo Find X8 Pro : వారెవ్వా.. ఆఫర్ అదిరింది మావా.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఇంత తక్కువా? మీ బడ్జెట్‌లోనే..!
ఎయిర్‌టెల్ రూ. 355 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 355 ప్రీపెయిడ్ ప్లాన్ అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రస్తుత ఆఫర్‌ను బట్టి అన్‌లిమిటెడ్ కాల్స్, స్టాండర్డ్ SMS బెనిఫిట్స్‌తో పాటు 25GB ఫిక్స్‌డ్ డేటాను అందిస్తుంది.
ఈ ప్లాన్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం బెనిఫిట్ కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లకు ‘ది సేఫ్ నెట్‌వర్క్’ కూడా అందిస్తుంది. ఏఐ ఆధారిత ఆటోమేటిక్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్, మొబైల్ వై-ఫై నెట్‌వర్క్‌లలో స్పామ్ కాల్స్, డేంజరస్ లింకులు, బ్యాంకింగ్ ఓటీటీ మోసాల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఏ ప్లాన్ ఎంచుకోవాలి? :
ఈ జియో, ఎయిర్‌టెల్ రెండు ప్లాన్‌లు దాదాపు ఒకే రకమైన బెనిఫిట్స్ అందిస్తున్నాయి. మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. డేటా, ఇతర బెనిఫిట్స్ కోసం జియో రూ. 355 ప్లాన్ బెస్ట్ ఆప్షన్
ఈజీ రీఛార్జ్ కోసం చూస్తుంటే ఎయిర్‌టెల్ ప్లాన్ తీసుకోవచ్చు. అదనంగా రూ. 24 చెల్లిస్తే ఎయిర్‌టెల్ రూ. 379 ప్లాన్ కూడా తీసుకోవచ్చు.
