Jio Recharge Plan : పండగ చేస్కోండి.. ఈ జియో ప్లాన్‌తో రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా, గూగుల్ జెమిని AI ఫ్రీ సబ్‌స్క్రిప్షన్..!
Jio Recharge Plan : జియో రీఛార్జ్ ప్లాన్ కావాలా? రూ. 579 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1.5: డెయిలీ డేటా, ఫ్రీగా గూగుల్ జెమిని ఏఐ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
- Sreehari A
- Published On : March 15, 2026 / 01:22 PM IST
Jio Recharge Plan
- జియో యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్
- రూ. 579తో రీఛార్జ్ చేసుకుంటే మరెన్నో డేటా బెనిఫిట్స్
- 1.5GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా గూగుల్ జెమిని సబ్‌స్క్రిప్షన్
Jio Recharge Plan : జియో కస్టమర్లకు పండగే. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, డేటా ప్లాన్ కోసం చూస్తుంటే ఈ జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ మీకోసమే. జియో రూ. 579 రీఛార్జ్ ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాదు.. గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్ కూడా ఫ్రీగా అందిస్తోంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా :
రిలయన్స్ జియో రూ. 579 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు 56 రోజుల లాంగ్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే రెండు నెలల వరకు రీఛార్జ్ అవసరం లేదు. డేటా పరంగా పరిశీలిస్తే.. 1.5GB హైస్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తంగా 84GB డేటాను పొందవచ్చు. ఏ మొబైల్ నెట్ వర్క్ అయినా వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు.
గూగుల్ జెమిని AI ప్రో సబ్‌స్క్రిప్షన్ :
జియో అందించే రూ. 579 ప్లాన్ ద్వారా యూజర్లు గూగుల్ జెమిని ఏఐ ప్రోకి 18 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అదే మీరు సపరేట్ గా తీసుకుంటే దాదాపు రూ. 35,100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ ఆఫర్ కోసం కనీసం రూ. 299 లేదా అంతకన్నా ఎక్కువ ధరతో 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు.
అంతేకాదు.. ఈ డేటా కోసం జియో టీవీలో లైవ్ ఛానెల్స్, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీని కూడా పొందవచ్చు. ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం.. రోజువారీ 1.5GB డేటా లిమిట్ దాటాక ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. అయినా వాట్సాప్ మెసేజ్ పంపవచ్చు. ఇమెయిల్ కూడా చెక్ చేయవచ్చు.
జియో రూ. 239 నుంచి రూ. 889 వరకు అనేక 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను అందిస్తుంది. అయితే, రూ. 579 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ, ఏఐ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ప్రీమియం ఏఐ సబ్‌స్క్రిప్షన్‌తో ఎలాంటి వార్షిక ప్లాన్ అందుబాటులో లేదు.
