Lava Bold N2 5G : స్టూడెంట్స్‌కి బెస్ట్ ఛాయిస్.. 6000mAh బ్యాటరీతో లావా 5G ఫోన్ ఆగయా.. ధర జస్ట్ ఎంతంటే?
Lava Bold N2 5G : రూ. 12వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో లావా బోల్డ్ ఎన్2 5జీ ఫోన్ వచ్చేసింది. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. పూర్తి ఫీచర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- June 3, 2026 / 04:51 PM IST
Lava Bold N2 5G
- లావా బోల్డ్ N2 5జీ ఫోన్ 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ నాచ్ డిస్‌ప్లే
- రియర్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరా, 6nm UNISOC T8200 ప్రాసెసర్
- లావా ఫోన్ ఫ్రీ హోమ్ సర్వీస్, జూన్ 9న అమెజాన్‌లో సేల్స్ ప్రారంభం
Lava Bold N2 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లావా కంపెనీ భారత మార్కెట్లో లావా బోల్డ్ N2 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ కూడా ఉంది. లావా బోల్డ్ N2 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ నాచ్ డిస్‌ప్లే ఉంది.
ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ 6nm UNISOC T8200 ప్రాసెసర్ అమర్చారు. లావా బోల్డ్ N2 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
లావా బోల్డ్ N2 5జీ ధర ఎంతంటే? :
లావా బోల్డ్ N2 5జీ ఫోన్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 కాగా, లాంచ్ ధర రూ. 11,999గా ఉంది. ఈ లావా ఫోన్ సేల్స్ జూన్ 9న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ప్రారంభంమవుతాయి. లావా ఫోన్ ఫ్రీ హోమ్ సర్వీస్‌తో వస్తుంది. తద్వారా యూజర్లు తమ ఫోన్‌లను ఇంటి వద్దనే రిపేర్ చేయించుకోవచ్చు.
లావా బోల్డ్ N2 5జీ స్పెసిఫికేషన్లు :
లావా బోల్డ్ N2 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ 6nm UNISOC T8200 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. లావా బోల్డ్ N2 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. రీగల్ గోల్డ్ బిలియనీర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బాక్స్‌లో ప్రొటెక్టివ్ కవర్, సింగిల్ టైప్-సి కేబుల్ 10W ఛార్జర్ ఉంటాయి.
