Lava Bold N2 Price Cut : సూపర్ ఫోన్ భయ్యా.. లావా బోల్డ్ N2 ధర ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్ రూ. 8,999కే
Lava Bold N2 Price Cut : లావా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బోల్డ్ N2 భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ధర తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 8, 2026 / 07:52 PM IST
Lava Bold N2 Price Cut
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు అందుబాటులో
- లావా బోల్డ్ ఎన్2 ధర భారీగా తగ్గిందోచ్
- ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర ఎంత తగ్గిందో తెలుసా?
Lava Bold N2 Price Cut : కొత్త లావా ఫోన్ కావాలా? అమెజాన్‌లో ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ సందర్భంగా భారతీయ బ్రాండ్ లావా బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ లావా బోల్డ్ N2 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ లావా ఫోన్ ప్రారంభ ధర కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో లావా ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో (Lava Bold N2 Price Cut) ప్రవేశపెట్టింది. అమెజాన్‌లో ఈ సేల్ ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
లావా బోల్డ్ N2పై ఆఫర్లు :
లావా బోల్డ్ N2 సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 9,299కు లభిస్తుంది. ప్రస్తుత సేల్‌లో ఈ ఫోన్‌పై రూ. 300 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో లావా ఫోన్‌ను రూ. 8,999కే కొనేసుకోవచ్చు. ఇండస్ బ్లాక్ సియాచెన్ వైట్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
లావా బోల్డ్ N2 ఫీచర్లు :
ఈ లావా ఫోన్ సరసమైన ధరలో లభిస్తోంది. 6.75-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే HD+ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. లావా బోల్డ్ N2, యునిసోక్ ఆక్టా-కోర్ 6nm చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో యునిసోక్ SC9863A ప్రాసెసర్‌తో పాటు 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ఫోన్ ర్యామ్‌ను 4GB వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీ ఉంది. అలాగే, 10W USB టైప్-సి ఛార్జర్ వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15గో ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
లావా బోల్డ్ N2 ఫోన్ బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అంతేకాదు.. 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. IP64 రేటింగ్ అందిస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ ఏడాది పాటు ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా అందిస్తోంది.
