Lava Virat Curve 5G : పండగ చేస్కోండి.. లావా విరాట్ కర్వ్ 5G ఫస్ట్ సేల్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Lava Virat Curve 5G : లావా విరాట్ కర్వ్ 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఈ లావా విరాట్ కర్వ్ 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- September 28, 2026 / 07:53 PM IST
Lava Virat Curve 5G
- ప్రారంభ ఆఫర్లతో లావా విరాట్ కర్వ్ 5జీ ధర రూ. 19,999
- మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5G SoC ద్వారా వస్తుంది
- 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది
Lava Virat Curve 5G : కొత్త లావా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. గత వారమే లాంచ్ అయిన లావా విరాట్ కర్వ్ 5జీ ఫోన్ భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. స్వదేశీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ మినీ డిస్‌ప్లేతో వస్తుంది.
తద్వారా కస్టమర్లు తమ ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే టెక్స్ట్, ఎమోజీలను సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లను చూసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. లావా విరాట్ కర్వ్ 5జీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6,000mAh బ్యాటరీతో వస్తుంది. పూర్తి ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర, ఆఫర్లు :
6GB ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ అందిస్తుంది. భారత మార్కెట్లో లావా విరాట్ కర్వ్ 5జీ ధర రూ. 23,999గా ఉంది. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ 28న సాయంత్రం 7 గంటలకు అమ్మకానికి వచ్చింది.
ఈ ఫోన్ హెరిటేజ్ ఇండిగో, మక్రానా ఐవరీ, ఎల్లోరా స్లేట్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ విరాట్ కర్వ్ 5జీ హ్యాండ్‌సెట్‌పై ఒక ఏడాది రీప్లేస్‌మెంట్ వారంటీని అందిస్తుండగా, వచ్చే యాక్సెసరీలకు 6 నెలల వారంటీ లభిస్తుంది.
Read Also : Free Mobile Games : గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించుకోవచ్చు.. ఈ 7 ఫ్రీ మొబైల్ గేమ్స్ ఓసారి ట్రై చేయండి..!
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
లావా విరాట్ కర్వ్ 5జీలో 6.67-అంగుళాల ఫుల్-HD ప్లస్ (1,080×2,400 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్ ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్‌పై మినీ డిస్‌ప్లే కూడా ఉంది. వాల్యూమ్ లెవల్, బ్యాటరీ శాతం, ఎమోజీలు, టైమ్, ఇతర నోటిఫికేషన్‌లను డిస్‌ప్లే చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. దీనికి 6GB LPDDR5 ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందిస్తుంది. అదనంగా 6GB వర్చువల్ ర్యామ్ కూడా సపోర్టు ఇస్తుంది.
కెమెరాల విషయానికొస్తే..
లావా విరాట్ కర్వ్ 5జీలో EISతో 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. లావా విరాట్ కర్వ్ 5జీలో 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీ ఉంది. కొలతలు 162.26 x 73.51 x 8.55mm, బరువు 184 గ్రాములు ఉంటుంది.
