Lenovo Legion Laptop : గేమింగ్ బీస్ట్ వచ్చేసింది.. ప్రపంచంలోనే ఫస్ట్ IJP OLED గేమింగ్ ల్యాప్‌టాప్!
Lenovo Legion Gaming Laptop : ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ఐజేపీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో గేమింగ్ ల్యాప్‌టాప్ లెజియన్ R9000P వచ్చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఏంటో తెలుసా?
- Sreehari A
- Published on- July 17, 2026 / 06:21 PM IST
Lenovo Legion Gaming Laptop
- లెజియన్ R9000P అనేది 240Hz రిఫ్రెష్ రేటింగ్ గేమింగ్ ల్యాప్‌టాప్
- 16 అంగుళాల స్క్రీన్ సైజు, 99శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజీ
- సింగిల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఐజేపీ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది
Lenovo Legion Gaming Laptop : గేమింగ్ ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్.. కొత్త లెనోవో ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. లెనోవో కొత్త లీజియన్ R9000P గేమింగ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ఇంక్‌జెట్-ప్రింటెడ్ (IJP) ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చిన గేమింగ్ ల్యాప్‌టాప్ (Lenovo Legion Laptop) ఇదేనని కంపెనీ ప్రకటించింది. ట్రెడిషనల్ ఓఎల్ఈడీ విధానానికి భిన్నంగా ఈ డిస్‌ప్లేను ఇంక్‌జెట్ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారైంది.
తద్వారా ఖరీదైన వాక్యూమ్ ఎవాపరేషన్ డివైజ్, మెటల్ మాస్క్‌ల అవసరం ఉండదు. అంతేకాదు.. తయారీ ఖర్చు తగ్గి వినియోగదారులకు తక్కువ ధరలోనే అడ్వాన్స్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్‌తో పాటు అత్యుత్తమ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్లు, ఇతర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Read Also : iPhone 18 Pro Max Leak : ఆపిల్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఇవే హైలెట్స్?
ధర ఎంతంటే? :
లెనోవో లెజియన్ R9000P గేమింగ్ ల్యాప్‌టాప్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ బ్రాండ్ త్వరలోనే ధరను ప్రకటించే అవకాశం ఉంది.
ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు :
లెనోవో లెజియన్ R9000P గేమింగ్ ల్యాప్‌టాప్ 16-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 240Hz అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఇంక్‌జెట్ ప్రింటెడ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ప్రపంచంలోనే ఫస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదే. ఈ ల్యాప్‌టాప్ 99శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజీని అందిస్తుంది.
అత్యుత్తమ ఫొటో క్వాలిటీ కోసం స్క్రీన్‌లో రియల్ ఆర్జీబీ స్ట్రైప్స్ ఉన్నాయి. సైడ్-బై-సైడ్ సబ్‌పిక్సెల్ ఉపయోగిస్తాయి. సాధారణ ఓఎల్ఈడీ సబ్‌పిక్సెల్‌ల ట్రైయాంగిల్ సెటప్ కారణంగా టెక్స్ట్ మసకబారకుండా కలర్ ఫ్రింజింగ్ నివారిస్తుంది. ఫలితంగా క్లియర్ టెక్స్ట్ షార్ప్ ఇమేజ్ కనిపిస్తాయి.
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ 99శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజీని అందిస్తుంది. అన్ని బ్రైట్‌నెస్ లెవల్స్ స్టేబుల్ కలర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ప్రొఫెషనల్ డిజైన్, ఆడియో-విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్, అనేక ఇతర అప్లికేషన్‌లను అందిస్తుంది. కంపెనీ ఇంకా పూర్తి స్పెసిఫికేషన్‌లను రివీల్ చేయలేదు. అయితే, సింగిల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఐజేపీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో గేమింగ్ డివైజ్‌లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
