Most Desired TV Brand : ఇండియాలో అమితంగా ఇష్టపడే టీవీ బ్రాండ్ ఏంటో తెలుసా?

భారతదేశంలో అమితంగా ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics) నిలిచింది. LG TV కంపెనీ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. 2021 ఏడాదిగానూ ట్రస్ట్ రీసెర్చ్‌ అడ్వైజరీ (TRA) భారత ‘మోస్ట్ డిజైర్డ్ టీవీ బ్రాండ్’ జాబితాను రిలీజ్ చేసింది.

LG Electronics most desired TV brand in India by TRA Research : భారతదేశంలో అమితంగా ఇష్టపడే టీవీ బ్రాండ్‌గా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ (LG Electronics) నిలిచింది. LG TV కంపెనీ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. 2021 ఏడాదిగానూ ట్రస్ట్ రీసెర్చ్‌ అడ్వైజరీ (TRA) భారత ‘మోస్ట్ డిజైర్డ్ టీవీ బ్రాండ్’ జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా 16 భారతీయ నగరాల్లో మొత్తం 3వేల యూనిక్ బ్రాండ్లు, ఇండస్ట్రీలు, కేటగిరీలకు సంబంధించి రిలీజ్ చేసింది. ఇందులో 2019తోపాటు 2020 ఏడాదిలో అత్యంత నమ్మకమైన టీవీ బ్రాండ్‌గా కంపెనీగా LG అవార్డు సొంతం చేసుకుంది.

వరుసగా 3 ఏళ్లుగా ఉన్నత గౌరవాన్ని పొందిన టీవీ బ్రాండ్ గా రికార్డు క్రియేట్ చేసింది. భారతీయ మార్కెట్‌ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోం ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ హక్‌ హ్యున్‌ కిమ్‌ (Hak Hyun Kim) తెలిపారు. TRA రిపోర్టులో 20వేల బ్రాండ్లు, 11 మిలియన్ల డేటా పాయింట్స్ నుంచి సేకరించిన కాంపిటేటీవ్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అందించింది.

దక్షిణ కొరియాకు చెందిన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రై. లిమిటెడ్, LG ఎలక్ట్రానిక్స్ జనవరి 1997లో భారతదేశంలో స్థాపించింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, HVAC, IT హార్డ్‌వేర్, మొబైల్ కమ్యూనికేషన్స్ స్పేస్‌లో అత్యంత పేరొందిన బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. భారత్‌లో, LG ప్రీమియం బ్రాండ్ నమ్మదగిన కంపెనీగా మంచి గుర్తింపును సాధించింది.

ట్రెండింగ్ వార్తలు