Lost Your Phone : మీ ఫోన్ పోయిందా? డేటా, డబ్బులు నష్టపోక ముందే ఈ 3 పనులు తప్పక చేయండి!

Lost Your Phone : మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ డేటాను ప్రొటెక్ట్ చేసుకోండి. మీ ఫోన్ పోయినప్పుడు సాధారణంగా FIR ఫిర్యాదును నమోదు చేస్తుంటారు.

Lost your phone_ 3 things you must do before someone steals your data and money

Lost Your Phone : మీ ఫోన్ పోయిందా? ఆందోళన పడొద్దు. వెంటనే మీ డేటాను ప్రొటెక్ట్ చేసుకోండి. సాధారణంగా ఫోన్ పోయినప్పుడు FIR ఫిర్యాదు నమోదు చేస్తుంటారు. ఫోన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు డేటాను ప్రొటెక్ట్ చేయకపోతే దుర్వినియోగమయ్యే  అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు మీ SIMని బ్లాక్ చేసుకోవాలి. డేటాను రిమోట్‌గా మీ ఫోన్‌ బ్లాక్ చేసుకోవచ్చు.

Lost your phone_ 3 things you must do before someone steals your data and money

ఫోన్‌ని బ్లాక్ చేయండి :
CEIR అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్.. మొబైల్ ఫోన్ పోయినా.. మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు లేదా అన్‌బ్లాక్ చేసేందుకు ఈ అధికారిక వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. మీ ఫోన్ బ్లాక్ చేయాలనుకుంటే మీరు ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు. www.ceir.gov.in ద్వారా మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. కానీ, మీరు FIR ఫైల్ చేయాలి.

మొబైల్ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్, పోలీసు ఫిర్యాదు నంబర్, మీరు మీ ఫోన్ పోగొట్టుకున్న స్థలం గురించి సమాచారం వంటి కొన్ని డాక్యుమెంట్లు వివరాలను అందించాలి. మీరు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత మీ పోగొట్టుకున్న ఫోన్‌ను బ్లాక్ చేసేందుకు మీరు చేసిన దరఖాస్తు పరిశీలించే అవకాశం ఉంటుంది.

Lost your phone_ 3 things you must do before someone steals

డేటాను రిమోట్‌గా డిలీట్ చేయండి :
మీరు Android ఫోన్‌ ద్వారా www.google.com/android/findకి వెళ్లి.. మీ Google ID, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి. అప్పుడు మీకు మీ ఫోన్ వివరాలు, లొకేషన్ చూపిస్తుంది. సెటప్ సెక్యూర్ అండ్ ఎరేస్ ఆప్షన్‌ను ఎంచుకుని మీ పోగొట్టుకున్న/దొంగిలించిన ఫోన్ డేటా మొత్తాన్ని రిమోట్‌గా డిలీట్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Data Theft Committee Report : డేటా చౌర్యం కమిటీ నివేదిక సిద్ధం.. రేపు అసెంబ్లీ ముందుకు 85 పేజీల రిపోర్టు

ట్రెండింగ్ వార్తలు