Data Theft Committee Report : డేటా చౌర్యం కమిటీ నివేదిక సిద్ధం.. రేపు అసెంబ్లీ ముందుకు 85 పేజీల రిపోర్టు

డేటా చౌర్యంపై ఏర్పాటైన కమిటీ నివేదిక సిద్ధం అయింది. రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం కమిటీ నివేదిక రానుంది. ఇవాళ అసెంబ్లీ లైబ్రరీ హాల్ లో పెగాసస్ కమిటీ సమావేశం అయింది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తోపాటు డేటా చౌర్యంపై కమిటీ విచారణ చేపట్టింది.

Data Theft Committee Report : డేటా చౌర్యం కమిటీ నివేదిక సిద్ధం.. రేపు అసెంబ్లీ ముందుకు 85 పేజీల రిపోర్టు

data theft committee report

Updated On : September 19, 2022 / 5:26 PM IST

Data Theft Committee Report : డేటా చౌర్యంపై ఏర్పాటైన కమిటీ నివేదిక సిద్ధం అయింది. రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం కమిటీ నివేదిక రానుంది. ఇవాళ అసెంబ్లీ లైబ్రరీ హాల్ లో పెగాసస్ కమిటీ సమావేశం అయింది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తోపాటు డేటా చౌర్యంపై కమిటీ విచారణ చేపట్టింది. ఈ సమావేశానికి భూమన, పార్థసారథి, అబ్చయ్య చౌదరి, జగన్ మోహన్ రావు, జక్కంపూడి రాజా హాజరయ్యారు.

TDP Members Suspend : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు ఒక రోజు పాటు సస్పెన్షన్

గతంలో రెండు సార్లు సమావేశమైన కమిటీ..  డేటా చౌర్యం జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. వైసీపీ నేతలకు సంబంధించిన డేటా పలు ఐపీ అడ్రస్ లకు వెళ్లినట్లు కమిటీ తేల్చింది. డేటా చౌర్యంపై 85 పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం రేపు అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టనుంది.