Site icon 10TV Telugu

కస్టమర్లు గందరగోళం : Jio ఇంటర్నెట్ సేవలకు బ్రేక్

Many Users effected : Jio 4G mobile internet service Down

రిలయన్స్ జియో ఇంటర్నెట్ సర్వీసు ఒక్కసారిగా స్తంభించిపోయింది. జియో ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఏమైందో తెలియక చాలామంది యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జియో నెట్ వర్క్ సర్వీసులకు బ్రేక్ పడింది. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఏమైందో తెలియక చాలామంది యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28, 2019 (శనివారం) పలు నగరాల్లో జియో ఇంటర్నెట్ సేవలపై కస్టమర్లలో గందరగోళం నెలకొంది.

కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి జియో ఇంటర్నెట్ సర్వీసు బాగానే ఉండగా, మధ్యాహ్న సమయంలో నెట్ వర్క్ డౌన్ అయింది. న్యూఢిల్లీ, బెంగళూరు ముంబై, చండీగఢ్, షహరాన్ పూర్, చెన్నై, జైపూర్, హైదరాబాద్ నగరాల్లో జియో ఇంటర్నెట్ సిగ్నల్స్ డౌన్ కావడంతో కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఢిల్లీలో అత్యధిక ప్రభావం ఉండగా, మిగతా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య తక్కువగా ప్రభావం ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.

కొంతమంది జియో యూజర్లకు ఫోన్ కాల్స్  కూడా అంతరాయం కలిగినట్టు సోషల్ మీడియా వేదికగా కంప్లయింట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ కొన్నిచోట్ల జియో యూజర్లకు ఫోన్ కాల్స్ (62శాతం) నిలిచిపోగా.. ఇంటర్నెట్ సిగ్నల్స్ (37శాతం) వరకు నిలిచిపోయినట్టు డౌన్ డిటెక్టర్ రిపోర్టు తెలిపింది.

జియో యూజర్లలో ఇంటర్నెట్ సమస్య ఎక్కువ మందికి ఉన్నట్టు కనిపిస్తోంది. జియో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఏం చేయాలో తెలియక జియో యూజర్లు ఎలా కంప్లయింట్ చేయాలో తెలియక సతమత మవుతున్నారు. 

జియో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోవడం ఇది 3వ సారి. ఈ ఏడాది జూలై 31న జియో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రెండో సారి ఆగస్టు 19న నిలిచిపోగా మూడోసారి సెప్టెంబర్ 28న జియో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్టు రిపోర్టు తెలిపింది. 

Exit mobile version