Samsung Galaxy S25 5G : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఎంత తగ్గిందో తెలుసా?
Samsung Galaxy S25 5G : ఈ శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభ్యమవుతోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో అసలు ధర కన్నా భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S25 5G (Image Credit To Original Source)
- అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5జీ రూ.69వేలకుపైగా తగ్గింపు, అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు
- నెలకు రూ.2,461 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ, పాత ఫోన్లపై రూ.43,300 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
- 6.2-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాలు
Samsung Galaxy S25 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి బంపర్ ఆఫర్.. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందే అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ. 69వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ నుంచి ఇప్పటివరకు ఇదే అతి తక్కువ ధరగా చెప్పొచ్చు. మీరు మరో రెండు రోజులు ఆగితే అమెజాన్ రిపబ్లిక్ డేస్ సేల్ 2025 కూడా ప్రారంభం కానుంది.
ఈ సేల్ సమయంలో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ సమయంలో ధర తగ్గింపుతో పాటు కొన్ని అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు. మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తే.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5G ధర ఎంతంటే? :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ రూ.69,990కి అందుబాటులో ఉంది. ప్రారంభ లాంచ్ ధర రూ.82,999 కన్నా తక్కువకే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ.68,490కి తగ్గుతుంది. అమెజాన్ రూ.2,461 నుంచి ఈఎంఐలతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే.. మీరు అదనంగా రూ. 43,300 వరకు సేవ్ చేయవచ్చు. ఈ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రేట్ ఉంటుంది. లేదంటే అదనంగా చెల్లించి ఎక్స్ టెండెడ్ వారంటీ, ఇతర యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు.

Samsung Galaxy S25 5G (Image Credit To Original Source)
శాంసంగ్ గెలాక్సీ S25 5G స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. వన్ యూఐ 8 అప్‌డేట్‌పై రన్ అవుతుంది. త్వరలో కొత్త ఏఐ ఫీచర్‌లతో లేటెస్ట్ వన్ యూఐ 8.5 పొందుతుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో 3x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో అందిస్తుంది.
