Mivi One 5G Launch : బడ్జెట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్! 3 రంగుల్లో మివి వన్ 5G వస్తోందోచ్.. ధర జస్ట్..

Mivi One 5G Launch : మివి వన్ 5జీ ఫోన్ ఈ నెల 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 16 సపోర్టుతో మొత్తం 3 కలర్ ఆప్షన్లలో రానుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

  • Published on- September 12, 2026 / 07:13 PM IST

Mivi One 5G Launch

  • కంపెనీ మివి వన్ 5జీ 3 కలర్ వేరియంట్లలో లాంచ్
  • బ్లూ, గ్రీన్ బర్గండీ కలర్ వేరియంట్లలో లభించనుంది
  • ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌

Mivi One 5G Launch : మివి కంపెనీ నుంచి సరికొత్త ఫస్ట్ 5జీ ఫోన్ రాబోతుంది. మివి వన్ 5జీ మోడల్ సెప్టెంబర్ 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ 5జీ ఫోన్ కంపెనీ ఫీచర్లను ముందుగానే వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మివి 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.

షెడ్యూల్ ప్రకారం.. మరో 12 రోజుల్లో రానుంది. కంపెనీ ముందుగానే కలర్ వేరియంట్లను రివీల్ చేసింది. అంతేకాదు.. కంపెనీ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో సహా అనేక ఇతర ఫీచర్లను కూడా ఆవిష్కరించింది. మివి వన్ 5G ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెల 24నే లాంచ్ :
మివి వన్ 5జీ సెప్టెంబర్ 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కంపెనీ మివి వన్ 5జీ కలర్ వేరియంట్లను ఆవిష్కరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా మివి అధికారిక హ్యాండిల్ ఈ కలర్ వేరియంట్లను టీజ్ చేసింది. లేటెస్ట్ పోస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కూడా కంపెనీ ధృవీకరించింది.

Read Also : Oppo K14 Lite Launch : బ్యాటరీ బీస్ట్ వస్తోంది.. కొత్త ఒప్పో K14 లైట్ అదుర్స్.. లాంచ్ డేట్ తెలిసిందోచ్..!

కంపెనీ మివి వన్ 5జీని 3 కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయనుంది. గ్రీన్ కలర్ ఇప్పటికే రివీల్ అయింది. బ్లూ కలర్ అందించే రెండు కొత్త వేరియంట్లు కూడా ఉన్నాయి. మూడో కలర్ బర్గండీగా ఉంటుందని అంచనా. కంపెనీ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కూడా రివీల్ చేసింది. మివి వన్ 5జీ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది.

కెమెరా ఫీచర్లు (అంచనా) :
ఈ ఫోన్ ఎలాంటి అనవసరమైన హంగులు లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఎడ్జ్ కర్వ్ కనిపిస్తాయి. కెమెరా బార్ వర్టికల్ ఉంటుంది.

కెమెరా మాడ్యూల్‌లో 2 కెమెరాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్‌కు బయట, రైట్ సైడ్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. పైభాగంలో ఒక మైక్రోఫోన్ కనిపిస్తుంది. నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ. 15వేలు ఉండవచ్చని తెలుస్తోంది. బడ్జెట్ ఫోన్‌గా లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇతర ఫీచర్లు కూడా త్వరలో వెల్లడి కానున్నాయి.