Oppo K14 Lite Launch : బ్యాటరీ బీస్ట్ వస్తోంది.. కొత్త ఒప్పో K14 లైట్ అదుర్స్.. లాంచ్ డేట్ తెలిసిందోచ్..!
Oppo K14 Lite Launch : ఒప్పో K14 లైట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ T7250 చిప్సెట్తో వస్తుందని అంచనా. ఒప్పో K14 లైట్లో ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా.
Oppo K14 Lite Launch
- సెప్టెంబర్ 16న భారత మార్కెట్లో ఒప్పో K14 లైట్ లాంచ్ కానుంది
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్‌గా యునిసోక్ T7250 అందించనుంది
- ఒప్పో K14 లైట్ 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది
Oppo K14 Lite Launch : ఒప్పో కొత్త ఫోన్ కొంటున్నారా? వచ్చే వారం భారత మార్కెట్లో ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఒప్పో K14 లైట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ టి7250 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. ఒప్పో K14 లైట్లో 7,000mAh బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కూడా అందిస్తుందని భావిస్తున్నారు. ఒప్పో K14 లైట్ లాంచ్, ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
రాబోయే ఒప్పో K14 లైట్ స్మార్ట్‌ఫోన్ ల్యాండింగ్ పేజీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్షమైంది. భారత మార్కెట్లో సెప్టెంబర్ 16న ఈ ఫోన్ లాంచ్ కానుంది. డార్క్ బ్రౌన్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒప్పో కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 mAh బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ 26 గంటలకుపైగా వీడియో ప్లేబ్యాక్‌తో వస్తుందని ఒప్పో పేర్కొంది.
కెమెరా ఫీచర్లు (అంచనా) :
ఒప్పో K14 లైట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ T7250 చిప్సెట్తో రన్ అవుతుందని అంచనా. ఒప్పో K14 లైట్లో ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్, మే నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో A6c 4జీ ఫోన్ పోలి ఉంటుందని అంచనా.
120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్, 6.75-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే (720 × 1,570 పిక్సెల్స్)తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
ఒప్పో K14 స్పెషిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో యునిసోక్ టీ7250 చిప్సెట్ మాలి-G57 జీపీయూ ఉన్నాయి. ఇందులో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఇ-కంపాస్ వంటి సెన్సార్లు ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి.
ఒప్పో A6c ఫోన్ 7000mAh బ్యాటరీ, 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేప్టీ కోసం పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కూడా త్వరలో లాంచ్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో కొత్త OLED డిస్ప్లే ఉండొచ్చు. అయితే, ఈ సిరీస్ డిస్ప్లేకు సంబంధించి ఒప్పో ఇంకా రివీల్ చేయలేదు.
