Mivi One 5G Launch : మివి వన్ 5G ఫస్ట్ ఫోన్ వస్తోంది.. ఇండియాలో లాంచ్ డేట్ ఇదే.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే!

Mivi One 5G Launch : మివి వన్ 5జీ సెప్టెంబర్ 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. డ్యూయల్ కెమెరాలతో గ్రీన్ కలర్ ఆప్షన్లలో రాబోతుంది. పూర్తి వివరాలివే..

Mivi One 5G Launch

  • మివి వన్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది
  • భారత మార్కెట్లో ఈ నెల 24నే లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడి

Mivi One 5G Launch : సూపర్ ఫోన్ భయ్యా.. భారత మార్కెట్లోకి మివి ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. దీనికి సంబంధించి కంపెనీ టీజర్‌ కూడా వదిలింది. అదే.. మివి వన్ 5జీ ఫోన్.. 5జీ కనెక్టివిటీతో వస్తున్న కంపెనీ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కూడా. అందుకే దీనికి ‘వన్’ అనే పేరు పెట్టింది. కానీ, ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇటీవల లాంచ్ చేసిన టీజర్‌లో కంపెనీ ఈ లాంచ్‌ను రివీల్ చేయగా లేటెస్ట్ అప్‌డేట్‌లో లాంచ్ తేదీని కూడా ఖరారు చేసింది. ఈ ఫోన్ సెప్టెంబర్ చివరిలో లాంచ్ కానుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో మివి వన్ 5జీ లాంచ్ తేదీ? :
భారత మార్కెట్లో మివి వన్ 5జీ ఫోన్ లాంచ్ కానున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ కోసం కంపెనీ స్పెషల్ మైక్రోసైట్‌ కూడా క్రియేట్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 24న లాంచ్ కానుంది.

Read Also : OnePlus Nord CE 6 : ఖతర్నాక్ ఆఫర్.. ఇలా కొంటే వన్‌ప్లస్ నార్డ్ CE 6 అతి చౌకైన ధరకే.. ఈ డీల్ మళ్లీ రాదు!

ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్స్‌క్లూజివ్‌ ఫోన్ అనమాట. ఈ బ్రాండ్ చిప్‌సెట్ గురించి కూడా హింట్ ఇచ్చింది. స్పెషల్ ల్యాండింగ్ పేజీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. టీజర్ పోస్టర్ మివి వన్ 5జీ డిజైన్, కలర్ ఆప్షన్లను వెల్లడించింది.

మివి వన్ 5జీ డిజైన్, ఫీచర్లు :
మివి వన్ 5జీకి 5జీ కనెక్టివిటీ సపోర్ట్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రన్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. కానీ, మివి ఇంకా ఆ చిప్‌సెట్ పేరును రివీల్ చేయలేదు.

డిజైన్ పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ ఎడ్జ్ కర్వ్ యాంగిల్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్‌ వెరీ పవర్ ఫుల్ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేశారు. మివి ఫోన్ కెమెరా బార్ వర్టికల్ ఉంటుంది.

కెమెరా మాడ్యూల్‌లో 2 కెమెరాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్‌కు బయట, రైట్ సైడ్ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అమర్చారు. పైభాగంలో ఒక మైక్రోఫోన్ కూడా కనిపిస్తుంది.

భారత్‌లో మివి వన్ 5G ధర (అంచనా) :
మివి వన్ 5జీ ధరపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఈ ఫోన్ బడ్జెట్ ధరకు వస్తుందని, భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ. 15వేలు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ 6GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్‌తో అనేక వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. కంపెనీ త్వరలో మరిన్ని కీలక ఫీచర్లను రివీల్ చేయనుంది.