Mobile data not working_ 5 ways you can fix the issue
Mobile Data Issue Fix : భారత మార్కెట్లోకి 5G సర్వీసులు అధికారికంగా అక్టోబర్ 2022లో అందుబాటులోకి వచ్చాయి. దేశంలో 5G సర్వీసులను ప్రారంభించిన సమయంలో టెలికాం ప్రొవైడర్లు రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్‌టెల్ (Airtel) ముందున్నాయి. కొందరు మొబైల్ యూజర్లు 5G ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సస్ చేసుకున్నారు. మరికొందరు మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా కనెక్టివిటీని అందుకోలేకపోతున్నారు. అలాగే, చాలామంది యూజర్లు తమ ఫోన్లలో తరచుగా మొబైల్ డేటా సమస్యలు ఎదుర్కొంటుంటారు.
లోడింగ్ స్క్రీన్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్ పాప్-అప్ మెసేజ్‌లు మాత్రమే కనిపిస్తుంటాయి. మీరు తరచుగా మొబైల్ డేటా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీకోసమే.. మీ మొబైల్ డేటాను పొందాలంటే ఎలాంటి మ్యాజిక్ ట్రిక్ లేదు. మీకోసం కొన్ని టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ‘trying to turn it off and on again’ అనేది మనం చేసే మొదటి పని. కానీ, ఇది వర్కౌట్ కాకపోతే.. మరో 5 ఉపయోగకరమైన కొన్ని టెక్ టిప్స్ ఉన్నాయి. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ మొబైల్ డేటా సమస్యను మీకు మీరే ఫిక్స్ చేసుకోవచ్చు.
1. Airplane మోడ్‌ను ఆన్ చేయండి లేదా మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి :
ఏదైనా నెట్‌వర్క్ సమస్య తలెత్తినప్పుడు.. ఫోన్‌లోని బ్యాటరీలను రిమూవ్ చేసి తిరిగి సెట్ చేసి ఆన్ చేస్తుంటారు. మొబైల్ కనెక్టివిటీ, ఫోన్ హ్యాంగ్‌అప్ ఫిక్స్ చేసేందుకు ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం చాలావరకూ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫోన్ బ్యాటరీని రిమూవ్ చేయడం సాధ్యపడదు. చాలావరకూ ఇన్ బుల్ట్ బ్యాటరీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. కొన్ని నిమిషాల పాటు మీ మొబైల్ డేటాను Airplane Mode ON చేయాలి. ఆపై దాన్ని మళ్లీ Off చేయండి. చాలా సందర్భాలలో, మొబైల్ డేటా నెట్‌వర్క్‌లను ఫిక్సింగ్ చేయడానికి Airplane మోడ్‌ను టోగుల్ చేయడం ద్వారా వెంటనే సమస్యను ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే, ఎయిర్‌ప్లేన్ మోడ్ ట్రిక్ పని చేయకపోతే.. మీ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి.. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఆన్ చేసేందుకు ప్రయత్నించండి.
2. మీ SIM కార్డ్‌ని తీసి మళ్లీ పెట్టండి :
మీరు ఫిజికల్ SIM కార్డ్‌ని ఉపయోగిస్తుంటే.. మీ డివైజ్ నుంచి తొలగించి తిరిగి ఇన్‌సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సులభంగా మొబైల్ డేటా సమస్యను వెంటనే పరిష్కరించవచ్చు.
Mobile data not working_ 5 ways you can fix the issue
3. రెండు సిమ్‌లు ఉంటే.. రెండింటి మధ్య నెట్‌వర్క్‌లకు మారండి :
మీరు రెండు SIM కార్డ్‌లను ఉపయోగిస్తుంటే.. అందుబాటులో ఉన్న బెస్ట్ నెట్‌వర్క్ నుంచి మారడానికి మీ ఫోన్‌లో ఆప్షన్ ఎంచుకోండి. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ యూజర్ల కోసం :
* settings> Mobile Data
* Mobile Dataపై Click చేయండి
* ‘Allow Mobile Data Switching’ ఆప్షన్‌పై Tap చేయండి.
Android యూజర్ల కోసం :
* settingsకు వెళ్లి mobile network ఎంచుకోండి.
* SIM management ఆప్షన్‌పై Click చేయండి.
* కాల్స్ సమయంలో Switch data connection ఆప్షన్ Tap చేయండి.
4. మీ మొబైల్ నెట్‌వర్క్ లిమిట్ చెక్ చేయండి :
కొన్నిసార్లు, మీరు మీ మొబైల్ డేటాను ఎక్కువగా వినియోగిస్తే.. రోజువారీ డేటా లిమిట్ అయిపోతుంది. ఫలితంగా మొబైల్ డేటా పనిచేయదు. దాదాపు అన్ని సర్వీస్ ప్రొవైడర్లు రోజుకి మీ మొబైల్ డేటా లిమిట్ దాటేముందు అలర్ట్ పంపుతాయి. అలాంటి మెసేజ్ వచ్చిందేమో చెక్ చేయండి. మీ అవసరాలకు సరిపోయే డేటా ప్లాన్‌ను ఎంచుకోండి.
5. మీ ఫోన్ అప్‌డేట్ చేశారో లేదో చెక్ చేయండి :
మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ స్టోర్‌లో తగినంత పెద్దదిగా ఉండదు. అన్ని అప్‌డేట్స్ అవసరం. మీ ఫోన్ మొబైల్ డేటా పని చేయకపోతే.. మీరు చాలా కాలంగా మీ ఫోన్‌ను అప్‌డేట్ చేయకపోవచ్చు. మీ ఫోన్ కనెక్టివిటీని పెంచే ముఖ్యమైన అప్‌డేట్‌ను మీరు కోల్పోయే అవకాశం ఉంది. (Settings) మెను నుంచి మీ ఫోన్‌ను అప్‌డేట్ చేయండి.
ఈ ట్రిక్స్ కూడా పనిచేయకపోతే మాత్రం.. మీ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి తెలియజేయాలి. ఒకవేళ మీ అకౌంట్లో లేదా మీరు ఉపయోగిస్తున్న SIMలో ఏదైనా తప్పు జరిగితే.. వెంటనే ఆ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..