UPI AutoPay : ప్రతినెలా యూపీఐ ఆటోపే పేమెంట్ అవుతుందా? ఈ ఫీచర్ ఇలా ఈజీగా ఆపేయొచ్చు..! సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

UPI AutoPay : మీరు ఏదైనా సర్వీసు కోసం ఆటోపే ఫీచర్ యాక్టివేట్ చేసుకున్నారా? ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటర్నెట్ వంటి వివిధ యుటిలిటీ సర్వీసులను వాడుతుంటాం. అయితే, ఈ ఫీచర్ ఎలా ఆపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Money being deducted automatically every month_ Here's how to stop UPI AutoPay

UPI AutoPay : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎన్‌పీసీఐ కొత్త ఆటోపే ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులను ఈజీగా పేమెంట్లను నిర్వహించుకోవచ్చు. మీరు ఏదైనా సర్వీసు కోసం ఆటోపే ఫీచర్ యాక్టివేట్ చేసుకున్నారా? అయితే, ఈ ఫీచర్ మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే, మీరు ఆటోపే ఫీచర్ యాక్టివేట్ చేసుకుని ఉంటే.. అది ఎలా ఆపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Whatsapp Tech Tips : వాట్సాప్‌లో మీ ఫ్రెండ్ డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

సాధారణంగా ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంటర్నెట్ వంటి వివిధ యుటిలిటీ సర్వీసులను వాడుతుంటాం. ఈ సర్వీసులు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లింపులు చేస్తుంటాం. కొంతమంది నెల లేదా ఏడాది చివరిలో బిల్లులను చెల్లిస్తుంటారు. కొన్నిసార్లు బిల్లులను చెల్లించాడంలో జాప్యం జరగవచ్చు. అందుకే బిల్లులను సకాలంలో చెల్లించేందుకు ఎన్‌పీసీఐ యూపీఐ యూజర్ల కోసం కొత్త ఆటోపే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఆటోపే ద్వారా బిల్లులను సకాలంలో చెల్లించడానికి వీలు కల్పిస్తుంది.

యుటిలిటీ సర్వీసులతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది. మీ అకౌంట్ ఆటోమేటిక్‌గా ప్రతి నెల లేదా సంవత్సరానికి నిర్దిష్ట మొత్తానికి డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. మీరు లేదా మీ తరపున మరొకరు మీ యూపీఐ అకౌంటులో కొంత సర్వీసు కోసం ఆటోపేని యాక్టివేట్ చేస్తుంటారు.

అయితే, ఈ యూపీఐ ఆటోపే ఫీచర్ మీ యూపీఐ అకౌంట్లో ఏదైనా సర్వీసులకు యాక్సస్ ఉందో లేదో ఈజీగా చెక్ చేయొచ్చు. మీ యూపీఐ అకౌంట్లలో ఆటోపే ఎలా ఎనేబుల్ చేయాలి? లేదంటే ఎలా డిజేబుల్ చేయాలో తెలుసా? ఇతర యూపీఐ యాప్‌లకు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు.. ఫోన్‌పేలో మీరు ఈ ఆటోపే ఆప్షన్ ఎలా నిలిపివేయాలో ఇప్పుడు చూద్దాం.

  • మీ ఫోన్‌లో యూపీఐ యాప్‌ ఓపెన్ చేయండి.
  • టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.
  • పేమెంట్ మేనేజ్ సెక్షన్ కింద ఆటోపే కోసం సెర్చ్ చేయండి.
  • ఆటోపే ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆటోపేకు యాక్సెస్ ఉన్న సర్వీసులను చూడొచ్చు.
  • మీరు ఆటోపేను పాజ్ చేయాలనుకుంటే సర్వీసుపై క్లిక్ చేసి, ఆపై ‘Pause’ చేయండి.
  • కిందికి స్క్రోల్ చేసి, ‘Delete Autopay’పై ట్యాప్ చేయడం ద్వారా కూడా ఆటోపేని నిలిపివేయొచ్చు.

మరోవైపు.. స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో భాగంగా మారాయి. కేవలం కాల్స్ చేయడం, మెసేజ్ పండమే కాదు.. డిజిటల్ పేమెంట్లు, బ్యాంకింగ్ వంటి సర్వీసులకు కూడా వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు డాక్యుమెంట్‌లు, ఫోటోలు, యాప్‌లు, సోషల్ మీడియా పోస్టులు, లొకేషన్ డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేస్తాయి.

అయితే, ఈ సమాచారం తప్పుడు చేతుల్లోకి వెళితే అది మోసానికి దారితీస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లలోని అనేక యాప్‌లను ఆపరేట్ చేసేందుకు నిర్దిష్ట అనుమతులు అవసరం. ఈ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా మీ వ్యక్తిగత డేటాను సేకరించే వీలుంది. అందుకే, ఈ ఫోన్‌లో యాప్ అనుమతులను వెంటనే రివ్యూ చేసి డిలీట్ చేయడం చాలా కీలకమని గుర్తించాలి.

Read Also : New Telecom Rules : అక్టోబర్ 1 నుంచే ట్రాయ్ కొత్త రూల్స్.. మీ నెట్‌వర్క్ ఏదైనా సర్వీసు క్వాలిటీని తెలుసుకోవచ్చు..!