Mother’s Day 2026 : మదర్స్ డే స్పెషల్.. అమ్మ మాటే మంత్రం.. ఆ ఒక్క అలవాటే మార్క్ జుకర్‌బర్గ్‌ను టెక్ కింగ్ చేసింది!
Mother’s Day 2026 Special : మార్క్ జుకర్‌బర్గ్ తల్లి తన కొడుకును ప్రశ్నలు అడగకుండా ఎప్పుడూ ఆపలేదు? ఈ అలవాటే అతడు ఫేస్‌బుక్ సీఈఓ స్థాయికి చేరేలా చేసిందో ఫుల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- May 9, 2026 / 04:44 PM IST
Mother’s Day 2026 Special, Mark Zuckerberg
- అమ్మ చెప్పిన మాట విన్నాడు.. ప్రపంచాన్నే ఏలుతున్నాడు
- అమ్మ ప్రోత్సాహం.. కొడుకు ప్రపంచ విజయం.. ఇదే మార్క్ జుకర్‌బర్గ్ స్టోరీ
- అమ్మ నేర్పిన అలవాటు.. బిలియన్ల సామ్రాజ్యానికి బాట వేసింది!
- మదర్స్ డే స్పెషల్ సందర్భంగా మార్క్ విజయంలో తల్లి పాత్ర
Mother’s Day 2026 Special : మదర్స్ డే.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర చాలా కీలకం.. ఈ విషయంలో అక్షరాలా నిజం చేసి చూపించారు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్.. ఆయన సక్సెస్ వెనుక తల్లి ఉన్నారు.. ఆమె ప్రోత్సాహంతోనే ఫేస్‌బుక్‌ను సృష్టించిన టెక్ మేధావిగా నిలిచారు.
మార్క్ జుకర్‌బర్గ్ చిన్నతనం నుంచే ప్రత్యేకమైన వ్యక్తి. కొత్త విషయాలు (Mark Zuckerberg Habit) నేర్చుకోవడం, మిషన్స్ ఎక్స్‌పర్‌మెంట్స్ చేయడం, ప్రశ్నలు అడగడం వంటి వాటిలో ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ, ఆయన తల్లి, కరెన్ రీటా కెంప్నర్ జుకర్‌బర్గ్ ఆయన టాలెంట్, ఉత్సుకతను గుర్తించి ఎప్పుడూ ప్రోత్సహించేవారు.
అలా తల్లి ప్రోత్సాహంతో మార్క్ ఈరోజు సోషల్ మీడియా కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగారు. మదర్స్ డే సందర్భంగా మార్క్ జుకర్ బర్గ్, తల్లి కెంప్నర్ జుకర్‌బర్గ్‌ల రియల్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కరెన్ రీటా కెంప్నర్ జుకర్‌బర్గ్ వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్.. ఇంట్లో పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా స్వేచ్ఛగా తిరిగేవారు. ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం వారి ఇంట్లో చాలా కామన్. టెక్నాలజీ పట్ల మార్క్‌కు చిన్నప్పటి నుంచి ఉన్న ఉత్సుకతను వారి కుటుంబం ఎప్పుడూ సమయం వృధాగా భావించలేదు.
ఆటలే కాదు.. ఆలోచించడం కూడా ముఖ్యమే :
మార్క్ జుకర్‌బర్గ్ చిన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేందుకు గంటల తరబడి కంప్యూటర్ ముందు గడిపేవారని అంటారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్క్రీన్‌లకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. రీటా, ఆమె భర్త తమ కొడుకు కేవలం ఆటలు ఆడటమే కాకుండా ఆలోచిస్తున్నాడని కూడా గ్రహించారు.
మార్క్ తండ్రి ఒకరోజున ఇంటికి కంప్యూటర్ తీసుకొచ్చారు. అయినప్పటికీ, మార్క్ ను కంప్యూటర్‌కు దూరం పెట్టలేదు. ఇంట్లో స్వేచ్ఛ, ప్రోత్సాహం అందించడంలో తల్లి కూడా కీలక పాత్ర పోషించింది.
పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెట్టకుండా రీటా జుకర్‌బర్గ్ వారి సొంతంగా ఆలోచించే స్వేచ్ఛను ఇచ్చారు. ఈ కారణంగానే మార్క్ చాలా చిన్న వయస్సులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు.
మార్క్ విజయానికి ఇదే పునాది :
మార్క్ జుకర్‌బర్గ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం.. ఆయన ఇంట్లో ప్రతి విషయానికి ‘ఎందుకు?’ అని అడగడం తప్పుగా భావించేవారు కాదు. పిల్లల్లో తెలుసుకోవాలనే ఉత్సుకతను కంట్రోల్ చేయొద్దని వారికి మార్గనిర్దేశం చేయాలని రీటా జుకర్‌బర్గ్ నమ్మేవారు. బహుశా ఇదే ఆలోచన ఆ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీకి సీఈఓ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.
మార్క్ జుకర్‌బర్గ్‌కు సక్సెస్ సీక్రెట్ కేవలం ఆయన మేధస్సు కాదు.. వెనుక ఉండి ఎంకరైజ్ చేసిన తల్లి కూడా ఒక బలం.. తాను భిన్నంగా ఉండటం బలహీనత కాదని, అదే తనకు బలమని ఆమె మార్క్‌కు నేర్పింది.
ఈ మాతృదినోత్సవం రోజున మార్క్, రీటా జుకర్‌బర్గ్‌ల స్టోరీ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.. కొన్నిసార్లు పిల్లలకు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఖరీదైన బొమ్మలు కాదు.. ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలని గుర్తుంచుకోవాలి.
