Flipkart Summer Sale : ఫోన్ కొనాలా..? టీవీ తీసుకుందామా..? స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లతో డబుల్ ధమాకా..!
Flipkart Summer Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్షిప్ కస్టమర్ల కోసం సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో, కస్టమర్లు స్మార్ట్ఫోన్లతో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులను తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
Flipkart Summer Sale 2026
- ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ఆఫర్లే ఆఫర్లు, డిస్కౌంట్లే డిస్కౌంట్లు
- ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్షిప్ కస్టమర్లకు మరిన్ని ఆఫర్లు
- ప్రత్యేకమైన డిస్కౌంట్లు, స్పెషల్ బ్యాంకు ఆఫర్లు
Flipkart Summer Sale 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్స్ కొనాలని చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్షిప్ కస్టమర్లకు ఇప్పటికే ఈ సేల్ అందుబాటులో వచ్చింది. ఈ సేల్ సమయంలో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ఆపిల్, రియల్‌మి, పోకో, వివో, రెడ్మీ వంటి బ్రాండ్ల నుంచి (Flipkart Summer Sale 2026) స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్లెస్ స్టీరియోలు (TWS), ఎయిర్ కండిషనర్లు (AC), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, పీసీ పెరిఫెరల్స్, హోం అప్లియన్సెస్ సహా పలు రకాల ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చ. మరోవైపు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కూడా మొదలైంది. ఈ రెండు సేల్స్ మధ్య మీకు నచ్చిన ఫోన్ లేదా టీవీ ఏదైనా కొనేసుకోవచ్చు.
బ్లాక్, ప్లస్ సభ్యుల కోసం ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ :
ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ అందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ సమయంలో వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ప్లస్ సభ్యులు 24 గంటల ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. తద్వారా ప్రత్యేకమైన డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్స్క్రైబర్లు ఎస్బీఐ కార్డ్‌లతో 15శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. హోం అప్లియన్సెస్ వేరబుల్స్‌పై అదనంగా రూ. 1,000, స్మార్ట్‌వాచ్‌లపై రూ. 500 తగ్గింపు పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ సమయంలో బ్లాక్ మెంబర్లు స్మార్ట్ టీవీలపై రూ. 10వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై అదనంగా రూ. 2వేలు, ఆడియో డివైజ్‌లపై రూ. 5వేల వరకు, పీసీ, ల్యాప్‌టాప్ కీబోర్డులపై అదనంగా రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు.
ఆపిల్ కొత్త ఐఫోన్ 17 మోడల్ 256GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర తగ్గింది. అసలు ధర రూ. 82,900 నుంచి కంపెనీ వెబ్సైట్లో రూ. 71,900కు లభిస్తోంది.
గత సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఆపిల్ వాచ్ SE 3 కూడా రూ. 21,999 తగ్గింపు ధరకు లభిస్తోంది. టాబ్లెట్ కొనాలనుకునే యూజర్లు రెడ్మి ప్యాడ్ 2 ప్రో 5జీ ద్వారా రూ. 24,999 తగ్గింపు ధరకు కొనేసుకోవచ్చు.
ఈ సేల్‌లో ఆపిల్‌తో పాటు, వివో, పోకో, రియల్మీ వంటి బ్రాండ్ల ఫోన్లు కూడా భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. మిడ్ రేంజ్ వివో ఎక్స్200టీ, రియల్‌మి P4x 5G,పోకో F7 5G ఫోన్లు వరుసగా రూ. 49,999, రూ. 16,999, రూ. 31,999 తగ్గింపు ధరలకు లభిస్తాయి. అయితే, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉండవచ్చు.
