Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే..
Moto G06 Power Price : మోటోరోలా G06 పవర్ ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై 30శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 9, 2026 / 05:13 PM IST
Moto G06 Power Price
- 7,000mAh బ్యాటరీ సెటప్, 18W ఛార్జింగ్ సపోర్ట్
- 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంది
- 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
Moto G06 Power Price : మోటోరోలా లవర్స్ కోసం సూపర్ ఆఫర్.. ప్రస్తుతం మోటోరోలా G06 పవర్ ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. మోటోరోలా ఈ బడ్జెట్ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 7000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు అసలు ధరపై 30శాతం భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. మోటోరలా G06 పవర్ ఫోన్ బెస్ట్ ఆఫర్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా G06 పవర్ ధర తగ్గింపు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జీ06 పవర్ అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్‌ను 30శాతం తగ్గింపుతో అసలు ధర నుంచి రూ.6వేలు తగ్గింపుతో పొందవచ్చు. తద్వారా రూ.13,999 ధరకు కొనేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుతో మోటోరోలా G06 పవర్ కొంటే అదనంగా రూ.700 ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర దాదాపుగా రూ.13,299 అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో అద్భుతమైన స్పెసిఫికేషన్లను అందించింది.
Read Also : Rent Boyfriend Scam : అమ్మాయిలూ.. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లకు పడిపోకండి.. సీపీ సజ్జనర్ హెచ్చరిక!
మోటోరోలా G06 పవర్ స్పెసిఫికేషన్లు :
మోటో G06 పవర్‌లో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. మోటోరోలా G06 పవర్‌లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
మోటో G06 పవర్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు, ప్లాస్టిక్ ఫ్రేమ్, వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉన్నాయి. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
