Moto G35 5G : మోటోరోలానా మజాకా.. ఈ మోటో G35 5G ఫోన్ జస్ట్ రూ. 12,999 మాత్రమే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
Moto G35 5G : మోటోరోలా జీ35 5జీ ఫోన్ కావాలా? ప్రస్తుతం భారత మార్కెట్లో మోటో జీ35 5జీ ఫోన్ అతి చౌకైన ధరలో లభిస్తోంది. మీ బడ్జెట్ రూ. 15వేలు లోపు అయితే ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published On : March 15, 2026 / 03:59 PM IST
Moto G35 5G Price
- మోటోరోలా జీ35 5జీ ఫోన్ ధర ఎంతంటే?
- రూ. 12,999 ప్రారంభ ధరతో మోటోరోలా ఫోన్ కొనేసుకోవచ్చు
- ఫోటోగ్రఫీ ప్రియులకు మోటోరోలా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
Moto G35 5G : మోటోరోలా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన 5జీ ఫోన్. కొంటే రూ. 15వేల లోపు ధరలో కొనేసుకోవచ్చు. చూసేందుకు ప్రీమియం లుక్ ఉంటుంది. సూపర్-ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అదే మోటోరోలా G35 5జీ ఫోన్. కేవలం రూ. 12,999 ప్రారంభ ధరతో 8GB ర్యామ్, 16MP సెల్ఫీ కెమెరా, వీగన్ లెదర్ ఫినిషింగ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో లభ్యమవుతుంది. మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ కోసం డల్ బై అట్మోస్ పవర్‌ఫుల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
డిస్‌ప్లే, డిజైన్ :
మోటో G35 5జీ డిజైన్ అదుర్స్. వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. ప్రీమియం లుక్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో వస్తుంది. 6.72-అంగుళాల ఫుల్ HD+ (FHD+) స్క్రీన్‌తో వస్తుంది. గేమింగ్, స్క్రోలింగ్ కోసం 240Hz టచ్ శాంప్లింగ్ రేటు ఉంది. సూర్యకాంతిలో కూడా క్లియర్ వ్యూ కనిపిస్తుంది. 1000-నిట్ పీక్ బ్రైట్‌నె స్‌తో వస్తుంది. కంటి రక్షణ కోసం విజన్ బూస్టర్, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందిస్తుంది.
కెమెరా సెటప్ :
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటోరోలా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రైమరీ సెన్సార్ 50MP సెన్సార్ డే అండ్ నైట్ మోడ్ ఫొటోలను తీయొచ్చు. గ్రూప్ ఫోటోల కోసం 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది. ఈ బడ్జెట్‌లో అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీ ప్రియుల కోసం, 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్, సోషల్ మీడియా కోసం అద్భుతమైన షాట్‌లను తీయొచ్చు.
పర్ఫార్మెన్స్, కనెక్టివిటీ ఆప్షన్లు :
మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ యూనిసోక్ T760 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్, భారీ యాప్‌లతో వస్తుంది. 5జీ చిప్‌సెట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్ ఉంది. మూవీలు, మ్యూజిక్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌తో వస్తుంది.
బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మోటోరోలా ఫోన్ సింగిల్ ఛార్జ్‌తో ఫుల్ డే వస్తుంది. 20W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ కూడా పొందవచ్చు. USB టైప్-C పోర్ట్ ద్వారా ఫోన్ సేఫ్ ఛార్జ్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, జీపీఎస్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
