Moto G77 Power 5G Launch : మతిపొగొట్టే ఫీచర్లతో కొత్త మోటోరోలా 5G ఫోన్.. సింగిల్ ఛార్జ్‌పై 59 గంటల బ్యాకప్.. ధర ఎంతంటే?
Moto G77 Power 5G Launch : మోటోరోలా జీ77 పవర్ ఫోన్ వచ్చేసింది. 7,000mAh బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, 8జీబీ ర్యామ్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ వచ్చేవారమే మొదలు కానుంది.
- Sreehari A
- Published on- July 9, 2026 / 05:11 PM IST
Moto G77 Power Launch
- భారత మార్కెట్లోకి మోటో జీ77 పవర్ ఫోన్ వచ్చేసింది
- 7,000mAh బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, 8జీబీ ర్యామ్ ఆప్షన్లు
- ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐ, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్
Moto G77 Power 5G Launch : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే ఇది మీకోసమే.. మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ మోటో G77 పవర్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫోన్ వచ్చేవారం దేశంలో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
ఈ ఫోన్ కంపెనీ బడ్జెట్ జీ సిరీస్‌లో ఇదే కొత్త మోడల్. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 పాంటోన్ కలర్ ఆప్షన్లలో (Moto G77 Power 5G Launch) సింగిల్ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. భారీ 7,000mAh బ్యాటరీ కూడా ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 59 గంటల వరకు బ్యాకప్ అందిస్తుంది. మోటో జీ77 పవర్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మోటో జీ77 పవర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
మోటో జీ77 పవర్‌లో 6.72-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1,080 x 2,400 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 120Hz, పిక్సెల్ డెన్సిటీ 391ppi, టాప్ బ్రైట్‌నెస్ 1,050 నిట్స్ వరకు ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ IP64 రేటింగ్ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8జీబీ వరకు ర్యామ్ 128జీబీ స్టోరేజ్ అందిస్తుంది. మోటోరోలా ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐతో వస్తుంది. ఈ ఫోన్‌కు ఏడాది పాటు ఓఎస్ అప్‌డేట్‌లు, 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్ కూడా పొందవచ్చు.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. :
మోటో జీ77 పవర్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50ఎంపీ (ఎఫ్/1.8), సోనీ LYT-600 సెన్సార్‌తో వస్తుంది. 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8ఎంపీ (ఎఫ్/2.2) అల్ట్రావైడ్ కెమెరా అందిస్తుంది.
ఈ ఫోన్‌లో 2-ఇన్-1 రియర్ లైట్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపీ (ఎఫ్/2.2) ఫ్రంట్ కెమెరా ఉంది. 30fps వద్ద 2కే రిజల్యూషన్ వరకు వీడియోను రికార్డ్ చేయొచ్చు.
భారత్‌లో మోటో జీ77 పవర్ ధర :
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో సింగిల్ మోడల్ మోటో జీ77 పవర్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 25,999 ధరకు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కంపెనీ రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, రూ. 2వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
ఈ కొత్త ఫోన్ జూలై 13 నుంచి భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి వస్తుంది. మోటో జీ77 పవర్‌ను పాంటోన్ ఫ్యూషియా రెడ్, పాంటోన్ ఇంపెనెట్రబుల్ పాంటోన్ నాటికల్ బ్లూ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
