Motorola Edge 50 Fusion 5G : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా 5G ఫోన్.. కర్వడ్ డిస్‌ప్లే కిర్రాక్.. ఏకంగా రూ. 7వేలు డిస్కౌంట్..!

Motorola Edge 50 Fusion 5G : మోటోరోలా ఫ్యాన్స్ తప్పక కొనాల్సిన ఫోన్. ఈ మోటోరోలా 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఏకంగా రూ. 7వేలు డిస్కౌంట్‌తో కొనేసుకోవచ్చు.

Motorola Edge 50 Fusion 5G

  • మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5జీ ఫోన్ ధర తగ్గింపు
  • కర్వడ్ డిస్ ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా మోటో ఫోన్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 7వేలు తగ్గింపు

Motorola Edge 50 Fusion 5G : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5జీ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ రెండింటినీ అందిస్తుంది. 2026లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్‌ప్లే, హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్, క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ మరింత ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5జీపై హాట్ డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5జీ ఫోన్ రూ. 18,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.25,999 కాగా, మొత్తం 27 శాతం తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం మిడ్-రేంజ్ కేటగిరీలో అత్యుత్తమ డీల్స్‌లో ఒకటి. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, ప్రొటెక్షన్ ప్లాన్‌ల వంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్ :
ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ pOLED ఎండ్‌లెస్ ఎడ్జ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఫుల్ వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 1600 నిట్స్ వరకు లైటింగ్ పరిస్థితులలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ కర్వడ్ షేప్, ప్రీమియం డిజైన్ అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, IP68 రేటింగ్ వాటర్, డస్ట్, ప్రమాదవశాత్తు కింద పడినా ప్రొటెక్ట్ చేస్తుంది.

Read Also : Car Prices Hike : కొత్త కారు కొనేవారికి బిగ్ అలర్ట్.. ఈ ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న కార్ల ధరలు.. E20 ఇథనాల్ మస్ట్.. ఫుల్ డిటెయిల్స్

కెమెరా, ఫీచర్లు :
ఈ మోటోరోలా ఫోన్ ఫొటోగ్రఫీ బెనిఫిట్స్ కోసం OISతో 50MP సోనీ లైటియా 700C ప్రైమరీ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. 13MP అల్ట్రా-వైడ్, మాక్రో లెన్స్ ఫొటోగ్రాఫర్‌లకు ల్యాండ్‌స్కేప్, క్లోజ్-అప్ ఫొటోలు రెండింటినీ క్యాప్చర్ చేయగలదు.

32MP ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ కెమెరా హై క్వాలిటీతో సెల్ఫీలను అందిస్తుంది. వినియోగదారులకు అద్భుతమైన వీడియో కాల్స్ చేస్తుంది. సోషల్ మీడియా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లకు అద్భుతంగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5జీ ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 4 నానోమీటర్ టెక్నాలజీతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ సిస్టమ్ అన్ని సాధారణ యాక్టివిటీలతో పాటు మల్టీ టాస్క్, లైట్ గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ క్లీన్ స్టాక్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ :
ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. రోజంతా వాడినా ఛార్జింగ్ అందిస్తుంది. ఈ సిస్టమ్ 68W టర్బోపవర్ టెక్నాలజీతో వస్తుంది. ఎక్కువసేపు ఫోన్ వాడినా ఛార్జ్ తొందరగా అయిపోదు.