Car Prices Hike : కొత్త కారు కొనేవారికి బిగ్ అలర్ట్.. ఈ ఏప్రిల్లో భారీగా పెరగనున్న కార్ల ధరలు.. E20 ఇథనాల్ మస్ట్.. ఫుల్ డిటెయిల్స్
Car Prices Hike : ఆటో రంగంలోని ఏప్రిల్ 1, 2026న కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా E20 ఇంధనం తప్పనిసరి కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Car Prices Hike
- కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
- ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెంచేస్తున్న కంపెనీలు
- మీ ఫేవరెట్ కారు మీ బడ్జెట్ ధరలో వస్తుందా? రాదా?
- ఇకపై అన్ని వాహనాల్లో E20 ఇథనాల్ మస్ట్
Car Prices Hike : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏప్రిల్ 1, 2026న ఆటో రంగంలోని కీలక నిబంధనలు మారనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో ఆటో రంగంలో గణనీయమైన మార్పులు రానున్నాయి.
ఈ క్రమంలోనే మార్కెట్లో పలు కంపెనీల కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని కూడా కేంద్ర అమల్లోకి తీసుకురానుంది. ఆటో రంగానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు పెంపు :
ఏప్రిల్ 1, 2026న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దేశీయ మార్కెట్లో అనేక కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. టాటా మోటార్స్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్, ఎంజీ మోటార్ సహా పలు ఆటో కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి.
లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్ కంపెనీలు కూడా కార్ల ధరలను 2 శాతం మేర పెంచుతున్నాయి. ఎంజీ మోటార్ కూడా ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతోంది. హోండా మోటార్స్ గత ధరల పెంపును కొనసాగిస్తోంది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచుతోంది. టాటా, టియాగో, నెక్సాన్, సఫారీ వంటి కార్లపై ధరలను రూ. 13వేల వరకు పెంచుతోంది. రూపాయి విలువ తగ్గడం, పెరిగిన ముడిసరుకులు, రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు కూడా పెరగడం వల్లే ఈ ధరల పెంపునకు కారణమని ఆటో కంపెనీలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా E20 ఇంధన అమలు :
ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా E20 ఇంధనం తప్పనిసరి కానుంది. E20 ఇంధనంలో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. కొత్త వాహనాలు E20 ఇంధనంతో నడుస్తాయి. అయితే, పాత వాహనాల మైలేజీలో 3 నుంచి 7 శాతం వరకు తగ్గుదల ఉండవచ్చు.
