Motorola Edge 50 Fusion : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఈ కొత్త మోటోరోలా ఫోన్‌పై రూ. 19వేలు తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర ఏకంగా రూ. 19వేలు తగ్గింపు పొందింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ అద్భుతమైన డీల్ పొందవచ్చు.. అది ఎలాగంటే?
- Sreehari A
- Published on- April 28, 2026 / 04:56 PM IST
Motorola Edge 50 Fusion
- అదనపు బ్యాంకు డిస్కౌంట్లతో రూ. 19వేల లోపు ధరకే లభిస్తుంది.
- ఈఎంఐ ప్లాన్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గింపు
- స్మూత్ డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరాలు, ఫాస్ట్ ఛార్జ్ సపోర్టు
Motorola Edge 50 Fusion : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. కొత్త మోటోరోలా ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. మీ బడ్జెట్ రూ. 20వేలు అయితే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, ఇతర ఫీచర్లతో లభ్యమవుతోంది.
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 22,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఈ ఫోన్ కావాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కోసం ఫ్లిప్‌కార్ట్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర ఎంతంటే? :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999కే లభిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 4వేలకు తగ్గింది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే అదనంగా రూ. 950 తగ్గింపు లభిస్తుంది.
ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా, నెలకు కేవలం రూ. 668 నుంచి నెలవారీ ఈఎంఐలతో కూడా చెల్లించవచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 13,150 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ టైప్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా రీసేల్ వాల్యూ ఉంటుంది.
ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ pOLED ప్యానెల్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్ట్ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
హార్డ్‌వేర్ విషయానికి వస్తే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌తో పాటు అడ్రెనో 710 గ్రాఫిక్స్ యూనిట్ ఉంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ LYT-700C మెయిన్ మాడ్యూల్, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయో-లెన్స్ కెమెరా ఉంది. అలాగే, ఫ్రంట్ సైడ్ 32MP ఫ్రంట్-ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,000mAhతో 68-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
