Samsung Galaxy S25 Ultra : అదిరే డిస్కౌంట్ బ్రో.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 30వేలు తగ్గింపు..!
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో ఏకంగా రూ. 30వేల వరకు ఆదా చేయొచ్చు. తద్వారా లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ రూ.
Samsung Galaxy S25 Ultra
- బ్యాంకు ఆఫర్లతో రూ. 30వేల వరకు ఆదా, రూ. 98వేలకు కొనేసుకోవచ్చు
- ఈ ఫోన్లో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్
- 200MP కెమెరా 5,000mAh బ్యాటరీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఈఎంఐ ఆప్షన్లు
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనుగోలుపై సుమారు రూ. 30వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
ఈ శాంసంగ్ ఫోన్ ఫీచర్లు, డిజైన్, పవర్ ఫుల్ హార్డ్‌వేర్‌తో పాటు అద్భుతమైన కెమెరా సెటప్ అందిస్తుంది. లక్ష విలువైన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనాలా? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అసలు ధర సుమారు రూ. 1,01,000గా ఉండగా బ్యాంకు ఇతర ఆఫర్లతో కలిపి రూ. 28వేలు తగ్గింది. ఈ ఫోన్ అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా మరో రూ. 3వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర నుంచి సుమారు రూ. 98వేలకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
ఒకవేళ అవసరమైతే.. ఈజీ ఈఎంఐలో కూడా ఈ ఫోన్ కొనేసుకోవచ్చు. ఈఎంఐ నెలకు రూ. 3,551 నుంచి ఉంటుంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ. 37,850 వరకు తగ్గించుకోవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా వాల్యూ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనాలా? వద్దా? :
మీరు పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతున్నారా? 2026లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అద్భుతమైన ఫ్లాగ్షిప్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సన్నని టైటానియం డిజైన్ అందిస్తుంది. ఎక్కువకాలం మన్నిక, యాంటీ-రిఫ్లెక్టివ్ ప్రొటెక్షన్, 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ పర్ఫార్మెన్స్, ఏఐ అప్‌గ్రేడ్ అందిస్తుంది. అలాగే, 200MP మెయిన్ సెన్సార్, కొత్త 50MP అల్ట్రా-వైడ్‌తో కెమెరా సిస్టమ్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, ఏడేళ్ల వరకు లాంగ్ టైమ్ సాఫ్ట్వేర్ సపోర్ట్, 45W ఛార్జింగ్ స్పీడ్ అందిస్తుంది.
