Motorola Edge 60 Series
Motorola Edge 60 Series : మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 లైనప్ తర్వాత మోటోరోలా లేటెస్ట్ ఎడ్జ్ 60 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.
కొత్త లీక్‌ల ప్రకారం.. కంపెనీ మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో, ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లను రిలీజ్ చేయనుంది. ఈ వేరియంట్‌లు త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే మోటోరోలా సిరీస్ ఫోన్లు అప్‌గ్రేడ్ స్పెషిఫికేషన్లు, స్టైలిష్ కొత్త కలర్ ఆప్షన్‌లు ఉండనున్నాయి.
మోటో G55, మోటో G85 అప్‌గ్రేడ్ ఫోన్లలో మోటో G56, మోటో G86 కూడా లాంచ్ కానున్నాయి. ఈ రాబోయే మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ల ధర, ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లు, కలర్ ఆప్షన్లకు సంబంధించి లీకులు బయటకు వచ్చాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ : ధర, కలర్ ఆప్షన్లు లీక్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర EUR 350 (దాదాపు రూ. 33,100) అంచనా. ఈ ఫోన్ బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 60 గ్రీన్, మోటోరోలా సీ బ్లూ షేడ్స్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర EUR 380 (దాదాపు రూ. 36వేలు) ఉంటుందని అంచనా.
ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర EUR 600 (సుమారు రూ. 56,800)గా ఉండవచ్చు. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, గ్రేప్ (పర్పుల్) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు. అంతేకాదు.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డెక్రా, రీన్‌ల్యాండ్, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లలో కూడా ప్రత్యక్షమైంది. త్వరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
మోటో G56, మోటో G86 ధర, వేరియంట్లు (అంచనా) :
మోటోరోలా మోటో ఎడ్జ్ 60 సిరీస్‌తో పాటు, మోటోరోలా నెక్స్ట్ జనరేషన్ మోటో G-సిరీస్ ఫోన్‌లను కూడా రిలీజ్ చేయనుంది. మోటో G6 బ్లాక్, బ్లూ, డిల్ (లైట్ గ్రీన్) కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుందని అంచనా. 8జీబీ + 256జీబీ మోడల్ ధర EUR 250 (సుమారు రూ. 23,700) ఉండవచ్చు.
మోటో G86 ధర అదే ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర EUR 330 (దాదాపు రూ. 31,200) ఉంటుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ గోల్డెన్, కాస్మిక్ (లైట్ పర్పుల్), రెడ్, స్పెల్‌బౌండ్ (బ్లూ) షేడ్స్‌లో వచ్చే అవకాశం ఉంది.