×
Ad

Motorola Edge 60 Stylus : లిమిటెడ్ ఆఫర్ బ్రో.. ఈ మోటోరోలా ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్, అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Edge 60 Stylus : మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో రూ. 5,500 అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 14, 2026 / 07:34 PM IST

Motorola Edge 60 Stylus

  • మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ అమెజాన్‌లో రూ.18,680 వద్ద లభిస్తోంది
  • రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గింది
  • ఈఎంఐ కేవలం రూ. 657 నుంచి ప్రారంభం, రూ. 17,500 వరకు అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్
  • 6.7-అంగుళాల 120Hz pOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్
  • 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

Motorola Edge 60 Stylus : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? అయితే, మీకో అద్భుతమైన డిస్కౌంట్.. స్టైల్, పెర్ఫార్మెన్స్ కోసం మంచి ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. అమెజాన్‌లో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్‌తో లభ్యమవుతోంది. ఈ మోటోరోలా ఫోన్ ప్రారంభ ధర రూ. 22,999 ఉండగా ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

అంతేకాదు, కొనుగోలుదారులు బ్యాంక్, కార్డు ఆఫర్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ డీల్ :
ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ రూ.18,680కి అమ్ముడవుతోంది. లాంచ్ ధర నుంచి రూ.4,319 ధర తగ్గింది. నేరుగా తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు ఎంచుకున్న క్రెడిట్ కార్డులపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. తద్వారా ధర మరింత రూ.1,500 తగ్గుతుంది. ఈ-కామర్స్ దిగ్గజం రూ.657 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.

Read Also : Apple iPhone 16 Plus : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఈ ఆపిల్ ఐఫోన్ ఏకంగా రూ. 21వేలు తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేసే యూజర్లు అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ కూడా పొందవచ్చు. గరిష్టంగా రూ. 17,500 ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ :

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 6.7-అంగుళాల pOLED ప్యానెల్‌తో ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. సూర్యకాంతిలో కూడా ఈ ఫోన్ 3000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇంటర్నల్ స్టైలస్‌తో కూడా వస్తుంది. ఈ ధరలో ఇలాంటి ఫోన్ దొరకదు.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో పాటు 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఈ మోటోరోలా మోటో యూఐ అప్‌గ్రేడ్‌తో పాటు ఆండ్రాయిడ్ 15తో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 32MP సెన్సార్‌తో వస్తుంది.