Motorola Edge 70 Plus : మతిపొగొట్టే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోన్ ఆగయా.. 200MP ట్రిపుల్ కెమెరాలు హైలెట్, ధర ఎంతంటే?
Motorola Edge 70 Plus : మోటోరోలా కొత్త ఫోన్ భలే ఉందిగా.. 200MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో వస్తుంది. ప్రీ ఆర్డర్లు ప్రారంభం కాగా, ఈ నెల 23 నుంచి సేల్ అందుబాటులో ఉంటుంది.
- Sreehari A
- Published on- September 4, 2026 / 08:12 PM IST
Motorola Edge 70 Plus
- మోటోరోలా ఎడ్జ్ 70 ప్లస్ ఫోన్ వచ్చేసింది
- 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్
- గొరిల్లా గ్లాస్ 7i లేయర్, MIL-STD-810H మన్నిక
- అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం
Motorola Edge 70 Plus : మోటోరోలా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎడ్జ్ 70 ప్లస్ ఫోన్ వచ్చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ అనేక అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో సూపర్ హెచ్‌డి రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.
ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 144Hz కాగా, టాప్ బ్రైట్‌నెస్ 5,200 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 7i లేయర్ అమర్చారు. IP64-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌తో కూడా వస్తుంది. MIL-STD-810H మన్నిక అందిస్తుంది. ప్రాసెసింగ్ కోసం 8GB ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ఉంది. ఆకర్షణీయమైన ఫీచర్లు ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధర, లభ్యత :
ఈ ఫోన్ సింగిల్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ధర సుమారుగా రూ. 68వేలు ఉండొచ్చు. ఈ ఫోన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. గ్రే లైలాక్, మౌంటెన్ వ్యూ మిల్కీ బ్లూ వంటి పాంటోన్ షేడ్స్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌తో పాటు ఫ్రీగా మోటో వాచ్ ఫిట్ మోటో ట్యాగ్ 2 కూడా సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్లస్ 6.78-అంగుళాల ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. సూపర్ HD రిజల్యూషన్ (2772 x 1272 పిక్సెల్స్)ను అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ 5,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లేలో HDR10+, 10-బిట్ కలర్ 100శాతం డీసీఐ-పీ3 కవరేజ్ ఉన్నాయి. కంపెనీ ఈ స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ 7i లేయర్ అమర్చింది. మన్నిక కోసం MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా ఉంది.
ఎడ్జ్ 70 ప్లస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB LPDDR5X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ 24GB వరకు వర్చువల్ ర్యామ్ కూడా సపోర్టు ఇస్తుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. కంపెనీ ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ 2031 వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్లస్ కెమెరాలో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. 2MP మాక్రో సెన్సార్ కూడా అందించారు. స్పెషల్ లైట్ సెన్సార్ థర్డ్ కెమెరాగా రన్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 32MP కెమెరా కూడా ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్లస్‌లో 45W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 7.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ 61 గంటల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇతర ఫీచర్లలో eSIM సపోర్ట్, 5జీ, Wi-Fi 6E, బ్లూటూత్ 6.0, NFC ఉన్నాయి.
