Motorola Edge 70 Pro : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఈ కొత్త మోటోరోలా ఫోన్ సగం ధరకే.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!
Motorola Edge 70 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోను చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ప్రారంభ ధర కన్నా చాలా తక్కువకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 8, 2026 / 07:07 PM IST
Motorola Edge 70 Pro
- ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లు
- ఈ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోపై భారీ తగ్గింపు
- ఈ మోటోరోలా ఫోన్ రూ. 33వేలు తక్కువకే లభిస్తుంది
Motorola Edge 70 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్ కొనసాగుతోంది. ఈ ఏడాది మోటోరోలా లాంచ్ చేసిన మిడ్ బడ్జెట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ ఫోన్లను దాదాపు సగం ధరకే కొనేసుకోవచ్చు. మోటోరోలా ఈ ఫోన్‌ను ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కంపెనీ, మోటోరోలా ఎడ్జ్ 70, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+, మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ వంటి ఈ సిరీస్‌కు చెందిన అనేక ఫోన్లు ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోపై ఆఫర్లు :
భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఫోన్ 8GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 256GB అనే రెండు స్టోరేజ్ (Motorola Edge 70 Pro) వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 38,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 36,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 69,999గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ. 33వేలు తక్కువకే లభిస్తుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్లు :
భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది. ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ ప్యానెల్‌ను వాడారు. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 5200 నిట్స్ వరకు ఉంటుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది. ఈ మిడ్-బడ్జెట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ ఉంది. 12GB వరకు ర్యామ్ 256GB స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ ఫోన్ మెటాలిక్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఇందులో IP68, IP69 రేటింగ్ ఉంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh సిలికాన్ బ్యాటరీతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ మోటోరోలా ఫోన్‌లో 50MP మెయిన్ OIS కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో వైఫై, బ్లూటూత్ NFC ఉన్నాయి.
