Motorola Edge 70 Pro : మోటోరోలా ఫ్యాన్స్‌కు పండగే.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ ఇదిగో.. ఫీచర్లు మాత్రం కేక..!

Motorola Edge 70 Pro : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మోటోరోలా నుంచి సరికొత్త ప్రో మోడల్ ఫోన్ వస్తోంది. ఈసారి మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే..

Motorola Edge 70 Pro

  • మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో అతి త్వరలో లాంచ్ కాబోతుంది
  • మోటరోలా ఫోన్‌కు సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ ప్రారంభం
  • మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది

Motorola Edge 70 Pro : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. మోటోరోలా కంపెనీ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే ఈ మోటోరోలా ఫోన్ ఒక సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని సూచిస్తోంది. మోటోరోలా ఇప్పుడు రాబోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్ టీజ్ చేసింది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో సిరీస్‌లో భాగంగా కనిపిస్తోంది. మోటోరోలా మైక్రోసైట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ ఫోన్ లైవ్ అయింది. కలర్ ఆప్షన్లు, డిజైన్‌ను కూడా కంపెనీ ముందే వెల్లడించింది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్లు, ధర అంచనాలపై ఓసారి వివరంగా పరిశీలిద్దాం..

భారత మార్కెట్లో త్వరలో లాంచ్ అయ్యే మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఒక మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ అనే ఈ-కామర్స్ సైట్ ద్వారా భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో టెయిలర్డ్-ఫ్యాబ్రిక్ ఫినిష్, శాటిన్-లక్స్ ఫినిష్, మార్బుల్ ఫినిష్‌లతో లభిస్తుంది.

Read Also : Lenovo Gaming Laptop : వారెవ్వా.. లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ చూశారా? ఖతర్నాక్ ఫీచర్లు, ధర జస్ట్ ఎంతంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా మైక్రోసైట్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో మార్కెటింగ్ మెటీరియల్‌ మాదిరిగా కనిపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లోని లైవ్ మైక్రోసైట్ ఎడ్జ్ 70 సిరీస్‌లోని ఫోన్‌కు సంబంధించినదని తెలుస్తోంది. ఈ కొత్త మోటోరోలా ఫోన్ డిజైన్ కూడా కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (CAD) రెండర్‌లను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ పేరును కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ ‘Moto Coming Soon Apr26’ అని ఉంది. కంపెనీ ఈ తేదీన ఫోన్ పేరు, ఇతర ఫీచర్లను రివీల్ చేయనుంది. అయితే, ఈ ఫోన్ ఏప్రిల్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ మోటోరోలా ఫోన్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు.

రాబోయే మోటోరోలా ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు. అంతేకాదు.. కొత్త మోటోరోలా ఫోన్‌లో పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ ఫోన్ రైట్ సైడ్ మరో బటన్ కూడా ఉంటుంది.