Motorola G85 Discount
Motorola G85 Discount : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త మోటోరోలా G85 5G ధర భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ మోటోరోలా ఫోన్ (Motorola G85) లాంచ్ ధర కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘ఫ్రీడమ్ సేల్’ సమయంలో రూ. 10,999కు మోటోరోలా G85 ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుతో మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక సేల్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 8 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
మోటోరోలా G85 5G ధర తగ్గింపు :
మోటోరోలా G85 5G ప్రారంభ లాంచ్ ధర రూ.15,999గా ఉండగా, ఈ మోటోరోలా ఫోన్ అసలు ధర రూ.20,999గా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.5వేలు తగ్గింది. ధర తగ్గింపుతో పాటు ఫోన్ కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ (8GB ర్యామ్ + 128GB, 12GB ర్యామ్ + 256GB) మొత్తం 2 స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది.
కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే, వివా మెజెంటా అనే 4 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ.15,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.5వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999కు పొందవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
మోటోరోలా G85 5G ఫీచర్లు :
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మోటోరోలా ఫోన్ 6.67-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz హైరిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
మోటో G85 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ సపోర్టు ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హలో యూఐపై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ప్రీమియం వీగన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, ‘స్వైప్-టు-షేర్’తో సహా అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ పవర్‌ఫుల్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు IP52 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.