Google Pixel 9a : పండగ చేస్కోండి.. ఈ గూగుల్ పిక్సెల్ 9aపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 13,500 డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
Google Pixel 9a
- భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a రూ. 49,999 ప్రారంభ ధరకు లాంచ్
- అమెజాన్‌లో రూ.38,737కి లిస్టింగ్, రూ.11,262 ఫ్లాట్ డిస్కౌంట్
- మీరు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత సేవింగ్
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేవారమే గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ లాంచ్ కు ముందుగానే అమెజాన్‌లో పిక్సెల్ 9a ఫోన్ ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ. 13,500 కన్నా ఎక్కువ డిస్కౌంట్లతో లభ్యమవుతోంది.
స్ట్రాంగ్ కెమెరా పర్ఫార్మెన్స్, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ అందించే మిడ్ రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే పిక్సెల్ 9a బెస్ట్ ఆప్షన్. ఆకర్షణీయమైన డిజైన్, సాఫ్ట్వేర్ వంటి ఫీచర్లు, స్పెషిఫికేషన్లతో మీ బడ్జెట్ ధరలో ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 9a డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ రూ.49,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.38,737కి లిస్ట్ అయింది. రూ.11,262 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యశ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.2,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 422.2 పీపీఐ వద్ద ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
డిస్ప్లే HDR కంటెంట్ కోసం 1800 నిట్స్ వరకు బ్రైట్నెస్ లెవల్స్ అందిస్తుంది. 2700 నిట్స్ వద్ద టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా, పిక్సెల్ 9a ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 5100 mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పిక్సెల్ 9a ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కూడా ఉంది.
