Flipkart AC Offers : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు.. ఇలా చేస్తే అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..
Flipkart AC Offers : ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ సేల్‌లో ఏసీలపై అదిరే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. రూ. 25వేల ధరలో మీకు నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు.

Flipkart AC Offers
Flipkart AC Offers : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు అందుబాటులో (Flipkart AC Offers) ఉన్నాయి. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీలు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్‌లు, ఎయిర్ కండిషనర్లు వంటి హోం అప్లియన్సెస్ సహా అనేక రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు ఉన్నాయి.
ఈ సేల్ సమయంలో ఆసక్తిగల కొనుగోలుదారులు 1 టన్ నుంచి 2 టన్నుల వరకు స్ప్లిట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. రూ. 25వేలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఏసీలను కొనుగోలు చేయొచ్చు. క్యారియర్, మిడియా, శాంసంగ్, గోద్రేజ్, వోల్టాస్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల స్ప్లిట్ ఏసీలపై అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
క్యారియర్ :
క్యారియర్ 6-ఇన్-1 కన్వర్టిబుల్ ఏసీ 2025 మోడల్. ఈ ఏసీ ధర రూ. 31,900 నుంచి లభ్యమవుతుంది. ఈ 1-టన్ ఏసీ ఇన్వర్టర్ స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా, కంపెనీ కంప్రెసర్‌పై 10 ఏళ్ల వారంటీ, PCBపై 5 ఏళ్ల వారంటీని అందిస్తుంది. ఈ 3-స్టార్ ఎనర్జీ-రేటెడ్ ఏసీ కొనుగోలు చేసేటప్పుడు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
వోల్టాస్ :
మీరు వోల్టాస్ 1.5-టన్, 3-స్టార్ రేటింగ్ స్ప్లిట్ ఏసీని కేవలం రూ.32,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ వోల్టాస్ ఏసీ 2025 మోడల్ కాగా 4-స్టెప్ అడ్జస్టబుల్ మోడ్‌తో వస్తుంది. ఇంకా, ఈ ఏసీ కొనుగోలుపై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.6వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
శాంసంగ్ :
శాంసంగ్ ఏఐ ఏసీ ధర రూ.40,489కు లభ్యమవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఏసీపై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ 1.5-టన్ ఏసీ 5-స్టెప్ కన్వర్టిబుల్ కూలింగ్ ఫంక్షన్, 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది.
మార్క్యూ :
ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ MarQ నుంచి 1-టన్ స్ప్లిట్ ఏసీపై అదిరే ఆఫర్.. 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఫీచర్, 3-స్టార్ రేటింగ్‌తో టర్బో కూలింగ్ వంటి టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఏసీని రూ.23,990కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, రూ.6వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
గోద్రేజ్ :
గోద్రేజ్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ AC 2025లో ప్రారంభమైంది. 30 శాతం ధర తగ్గింపుతో లభిస్తుంది. రూ. 31,990కి అందుబాటులో ఉంది. ఈ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీపై రన్ అవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 6వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.