Smart TV Offers : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? అమెజాన్‌లో 65 అంగుళాల స్మార్ట్‌టీవీలపై కిర్రాక్ డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!
Smart TV Offers : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా పలు బ్రాండ్ల స్మార్ట్‌టీవీలపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు అందబాటులో ఉన్నాయి.

Smart TV Offers
Smart TV Offers : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరి ఇంట్లో స్మార్ట్‌టీవీలు ఉంటున్నాయి. చాలామంది ఇంట్లోనే మినీ థియేటర్ వంటి బిగ్ స్మార్ట్ (Smart TV Offers) టీవీలను కొనుగోలు చేస్తున్నారు. బిగ్ స్ర్కీన్ కలిగిన స్మార్ట్ టీవీలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఏదైనా సేల్ సమయంలో ఈ స్మార్ట్ టీవీలను 65శాతం వరకు తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకుంటుంటారు.
ఇప్పుడు మీరు కూడా 65 అంగుళాల భారీ స్మార్ట్‌టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ ఆఫర్ మీకోసమే.. ఆసక్తిగల కస్టమర్లు 65-అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ద్వారా మీ బడ్జెట్ ధరలోనే పెద్ద స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
ఫాస్ట్ కనెక్టివిటీతో పాటు బిగ్ స్క్రీన్, అనేక OTT యాప్స్ పొందవచ్చు. ఏదైనా కొత్త స్మార్ట్‌టీవీ కొనే ముందు అమెజాన్ అందించే ఈ సేల్ ఆఫర్లను ఓసారి లుక్కేయండి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఎంచుకుని కొనేసుకోండి.
టీసీఎల్ 65-అంగుళాల స్మార్ట్ టీవీ :
టీసీఎల్ బ్రాండ్ 65-అంగుళాల స్మార్ట్ టీవీ. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు WiFi, USB, HDMI వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీలలో సౌండ్ అవుట్‌పుట్ 24 వాట్స్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. 16GB ROM, 2GB ర్యామ్, గూగుల్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఈ స్మా్ర్ట్‌టీవీని రూ. 53,990కి కొనుగోలు చేయవచ్చు.
తోషిబా 65-అంగుళాల స్మార్ట్ టీవీ :
తోషిబా కంపెనీ నుంచి ఈ స్మార్ట్‌టీవీ QLED డిస్‌ప్లే టెక్నాలజీతో 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 4K రిజల్యూషన్ కలిగి ఉంది. 49 వాట్ల స్పీకర్ అవుట్‌పుట్ ఉంది. ఈ టీవీ మల్టీ సౌండ్ మోడ్‌లతో డాల్బీ అట్మోస్ సౌండ్‌తో వస్తుంది. గేమ్ మోడ్, ఆటో లో లాటెన్సీ, ఫిల్మ్‌మేకర్ మోడ్‌తో Wi-Fi, కనెక్టివిటీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ తోషిబా స్మార్ట్‌టీవీ రూ. 57,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
సోనీ 65-అంగుళాల టీవీ :
65-అంగుళాల బ్లాక్ కలర్ సోనీ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్‌తో LED డిస్‌ప్లే టెక్నాలజీలో వస్తుంది. WiFi, కనెక్టివిటీ ఆప్షన్లలో వస్తుంది. ఆస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది. ఈ టీవీ సౌండ్ అవుట్‌పుట్ 20 వాట్స్ కాగా, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ సోనీ టీవీని రూ. 71,990కి కొనుగోలు చేయవచ్చు.